Health

Cancer: క్యాన్సర్ వచ్చి తగ్గకా మళ్ళీ వస్తుందా..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

Cancer: క్యాన్సర్ వచ్చి తగ్గకా మళ్ళీ వస్తుందా..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

Cancer: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు.. రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. క్యాన్సర్‌ చాలా రకాలు ఉన్నాయి.. క్యాన్సర్‌తో బాధపడే ప్రతి ఒక్కరికి.. వివిధ లక్షణాలు కనిపిస్తాయి. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్‌ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. మహిళలలో బ్రెస్ట్‌, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ క్యాన్సర్లు ఎక్కువగా చూస్తుంటాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ ఉండటంతో, వ్యాధి మరణాల రేటు కాస్త తగ్గింది. అయితే ఒక్కసారి దీన్నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ క్యాన్సర్ వస్తుందేమో అని భయం చాలామందిని వెంటాడుతుంది.

Also Read: పాలిచ్చే తల్లూలూ అలెర్ట్.

ట్రీట్‌మెంట్ తీసుకున్నాక కనిపించకుండా పోయిన క్యాన్సర్ కణాలు తిరిగి పెరుగుతాయని నమ్ముతారు. దీని గురించి న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన బ్రెస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నీల్ ఎం.అయ్యంగార్ న్యూస్‌18కి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. ట్రీట్‌మెంట్ తర్వాత క్యాన్సర్ మళ్లీ రిపీట్ అవుతుందా అంటే, కాదనే డాక్టర్లు చెబుతున్నారు. కానీ కొన్ని రకాల క్యాన్సర్లు మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువ. క్యాన్సర్ రకం, అది ఎంత వేగంగా పెరుగుతుంది, మొదట ఏ దశలో గుర్తించారనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్లు తిరిగి రావడం అనేది కొన్ని నెలల తర్వాత లేదా చాలా ఏళ్ల తర్వాతైనా జరగొచ్చు.

ఇది ఇంతకు ముందు ఉన్న చోటే, దగ్గర్లోని భాగాలలో, లేదా శరీరం వేరే భాగంలోనైనా కనిపించవచ్చు. వీటికి రిపిటీషన్ రిస్క్ ఎక్కువ కొన్ని రకాల క్యాన్సర్లు దాదాపు కచ్చితంగా తిరిగి వస్తాయి. ఉదాహరణకు, గ్లియోబ్లాస్టోమా (మెదడు క్యాన్సర్) దాదాపు 100% కేసుల్లో తిరిగి వస్తుంది. ఎపిథీలియల్ ఓవరియన్ క్యాన్సర్ విషయంలో 85% మందికి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. మూత్రాశయాన్ని తొలగించాక కూడా 30-54% మందికి బ్లాడర్ క్యాన్సర్ తిరగబెడుతుంది. కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లకు కూడా రికరెన్స్ రేట్ ఎక్కువ. కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్లు చికిత్స తర్వాత మొదటి ఐదేళ్లలోనే తిరిగి వస్తాయి. మరికొన్ని, హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ లాంటివి, మొదట్లో తక్కువగా తిరిగి వచ్చినా, చాలా ఏళ్ల తర్వాత వచ్చే అవకాశముంది.క్యాన్సర్ రికరెన్స్ సైన్స్.. క్యాన్సర్ రకం, అది ఎక్కడ వస్తుందనే దానిబట్టి లక్షణాలు మారుతుంటాయి.

Also Read: రోజు రెండు ముక్కలు వీటిని తింటే చాలు.

సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాల్లో గడ్డలు లేదా వాపులు, మానని పుండ్లు, ఎప్పటికీ తగ్గని దగ్గు లేదా బొంగురు గొంతు, కారణం లేకుండా బరువు తగ్గడం లేదా పెరగడం (4.5 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ), తీవ్రమైన అలసట ఉంటాయి. వీటితో పాటు రాత్రిపూట చెమటలు పట్టడం, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి పేగు కదలికల్లో మార్పులు, మూత్రవిసర్జనలో మార్పులు, మలంలో లేదా మూత్రంలో రక్తం పడటం, కడుపు నొప్పి, కామెర్లు లేదా మూత్రవిసర్జన సమయంలో నొప్పి వంటివి క్యాన్సర్ తిరిగి వస్తుందనడానికి సంకేతాలు. రికరెన్స్ రిస్క్ తగ్గించే చిట్కాలు.. క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశాలను తగ్గించుకోవడానికి డాక్టర్‌ను తప్పకుండా కలవాలి.

రెగ్యులర్ ఫాలో అప్స్ ద్వారా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. బ్యాలెన్స్‌డ్‌ డైట్, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌ తప్పనిసరి. స్మోకింగ్, ఆల్కహాల్ మానేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మెడిటేషన్ లేదా సైకోథెరపీ వంటి పద్ధతుల ద్వారా మనశ్శాంతి పొందాలి. డాక్టర్ చెప్పిన చికిత్సలను సరిగ్గా పాటించాలి. ఏవైనా కొత్త లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌కు తెలియజేయాలి. ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ చికిత్స అనేది క్యాన్సర్ రకం, అది ఎక్కడ తిరిగి వచ్చింది, రోగి ఆరోగ్యం వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. లోకల్ రికరెన్స్‌లో కణితులను తొలగించడానికి సర్జరీ బెస్ట్. క్యాన్సర్ కణాలున్న ప్రదేశాలపై దృష్టి పెట్టి వాటిని నాశనం చేయడానికి రేడియేషన్ థెరపీ బెస్ట్ ఆప్షన్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker