ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. ఎందుకంటే..?
క్యాన్సర్ అనేది శరీరంలోని ఓ అవయవానికి, కణజాలంలో మొదలయ్యే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా జనాలను బలితీసుకుంటున్న వ్యాధుల్లో క్యాన్సర్ మహమ్మారిది రెండో స్థానం. ఒక్క కణజాలంలో మొదలైన ఈ వ్యాధి అంతకంతకూ పెరుగుతూ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకు పైగా క్యాన్సర్ వ్యాధి రకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. అయితే భారత్‌లో ప్రతి పది మందిలో ముగ్గురు నుంచి నలుగురు దాకా ఈ సమస్యకు గురవుతున్నారని నివేదికలు తేల్చి చెప్పాయి.
అయితే ఇటీవలే ఈ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. ఈ వ్యాధి కారణంగా మరణించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా రెండవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఆరోగ్యకరమైన స్త్రీలలో రియడ్స్ సమయంలో ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం ఓ శరీర ప్రక్రియ.. అయితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా పీరియడ్స్..యుటెరైన్ క్యాన్సర్‌గా భావించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. చాలా మందిలో మారుతున్న సీజన్ కారణంగా దగ్గు ఓ సాధరణమైన సమస్య.
కానీ ఇలాంటి సమస్య ఒక నెల నుంచి రెండు నెలలు ఉంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణం అవ్వొచ్చని నిపుణులు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది కుటుంబ, సామాజిక, ఆర్థిక కారణాల వల్ల డిప్రెషన్ గురవుతారు. ఇదీ మీలో తరుచుగా కనిపిస్తే క్యాన్సర్ లక్షణమని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా మెదడులో కణితి ఉన్నప్పుడు టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చాలా మందిలో పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఇలాంటి సమస్యతో బాధపడతారు. కానీ ఎలాంటి వ్యాధి లేనప్పుడు కూడా రక్తం తరచుగా వస్తే.. మల లేదా పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. నిరంతర వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడం అందరికీ సాధారణం. ఎలాంటి వ్యాయామం లేకుండా బరువు తగ్గినట్లయితే.. అది క్యాన్సర్‌కు మొదటి సంకేతంగా భావించవచ్చు.