Health

Cancer Vaccine: క్యాన్సర్‌ రోగులకు గుడ్ న్యూస్, క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసిన రష్యా.

Cancer Vaccine: క్యాన్సర్‌ రోగులకు గుడ్ న్యూస్, క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసిన రష్యా.

Cancer Vaccine: మసాలా దినుసుల్లో క్యాన్సర్‌ని కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవచ్చు. ఎక్కువగా వాడే వాటిల్లో అల్లం కూడా ఒకటి. ఇందులోని కొన్ని జింజెరాల్ సమ్మేళనాలు.. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. పసుపు కూడా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది. తరచూ తీసుకుంటూ ఉంటే.. శరీరంలో క్యాన్సర్ కణాలు వ్యాప్తిని తగ్గిస్తుంది. అయితే క్యాన్సర్‌ రోగంతో అల్లాడిపోతున్న ప్రపంచానికి రష్య గుడ్ న్యూస్ చెప్పింది.

Also Read: ఉడకబెట్టిన పల్లీల గురించి ఈ విషయాలు తెలిస్తే చాలు.

దీని నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నట్టు పేర్కొంది. ముందుగా ఆ దేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జనవరి 2025 నుంచి రష్యన్ పౌరులకు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ TASS ప్రకారం రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఈ టీకా గురించి చెప్పారు. మాస్కోలోని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ గతంలో TASSతో మాట్లాడుతూ, క్యాన్సర్‌ పెరుగుదలను వ్యాక్సిన్ ఆపగలదని తెలిపారు. క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా నిరోధించగలదని చెప్పారు.

వ్యాక్సిన్‌ను క్యాన్సర్‌ను నివారించడానికి సాధారణ ప్రజలకు ఇవ్వకుండా క్యాన్సర్ రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తామన్నారు. ఈ వ్యాక్సిన్‌ను అన్ని రకాల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఇవ్వవచ్చు. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తయారీ రేసులో ఉన్న దేశాలు. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో రష్యన్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్‌తో సహా రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఏ క్యాన్సర్‌కు చికిత్స చేస్తుంది, ఎంత ప్రభావవంతంగా ఉంటుంది లేదా వ్యాక్సిన్‌ను ఏమని పిలుస్తారో స్పష్టంగా చెప్పలేదు. క్యాన్సర్‌ పని పట్టేందుకు శాస్త్రీయంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు.

Also Read: టీ తాగుతూ సిగరెట్‌ తాగుతున్నారా.?

చాలా దేశాలు ఈ పరిశోధనల్లో మునిగి ఉన్నాయి. కానీ రష్యా అందరి కంటే ఓ ముందడుగు వేసింది. క్యాన్సర్ చికిత్సలను అభివృద్ధి చేయడానికి జర్మన్ బయోటెక్నాలజీ కంపెనీతో 2023లో UK ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు మోడర్నా, మెర్క్ & కో చర్మ క్యాన్సర్ వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తోంది. గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడే హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)కి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌లు మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు రష్యా తీసుకొచ్చింది మాత్రం అన్ని క్యాన్సర్ కారకాలపై పని చేస్తుందని చెబుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker