Health

ఈ జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ జ్వరం రాదు. ఆ జాగ్రత్తలు ఏంటంటే..?

వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా తదితర విష జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే పరిసరాల పరిశుభ్రత, ముందు జాగ్రత్తలతో ఈ వ్యాధికి చెక్‌ చెప్పొచ్చు. అలాగే డెంగీ రావడం వల్ల‌ శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఈ క్ర‌మంలోనే అధిక నొప్పులు వ‌స్తుంటాయి. ఎన్నో ఇబ్బందులు పాడాల్సి వ‌స్తుంది.

ఇలాంటి స‌మ‌యంలో కొన్ని ర‌కాల ఆహార జాగ్ర‌త్త‌లు తీసుకుంటే డెంగ్యూకు చెక్ పెట్ట‌వ‌చ్చు. డెంగీతో బాధ‌ప‌డుతున్న వారికి దానిమ్మ‌, కివీ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తినాలి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌నుపెంచ‌డానికి స‌హాయం చేస్తుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతాయి. రెండు తాజా బొప్పాయి ఆకులను తీసుకొని, వాటి నుండి జ్యూసును తీసి, ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి రెండు చెంచాల జ్యూస్ ను డెంగ్యూ రోగికి ఇచ్చినట్లైతే రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. డెంగీ ఫీవర్ తో బాధ‌ప‌డుతున్న వారు ఎక్కువగా కొబ్బరి బోండాం నీళ్లు తాగితే మంచిది.

కొబ్బరి నీళ్ళు శరీరం ద్వారా కోల్పోయిన ఎలెక్ట్రోలైట్స్ మరియు ఇతర ట్రేస్ మినిరల్స్ అందించి శరీరంను డీహైడ్రేషన్ నుండి ర‌క్షిస్తుంది. డెంగీ ఫీవర్ తో పోరాడుతున్న‌ వారు నేచురల్ హెర్బల్ టీ తాగడం చాలా మంచిది. ఈ హేర్బల్ టీ అల్లం మరియు యాలకులతో తయారు చేయబడి ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వేపతో త‌యారు చేసిన ర‌సాన్ని డెంగ్యూ రోగి తాగ‌డం వ‌ల్ల చాలా మంచిది. శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచ‌డంతో పాటు రోగనిరోధక శక్తి కూడ పెరుగుతుంది. వ్యాధి నివార‌ణ‌కు బాగా స‌హాయ‌ప‌డుతుంది. ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

యూరినరీ అవుట్ పుట్ ను మెరుగుపరిచి యాంటీబాడీస్ ప్రోత్సహించి రోగి త్వరగా కోలుకొనేందుకు సహాయపడుతుంది. డెంగీ రోగికి ఒక మంచి ఆహారం సిట్రస్ పండ్లు. డెంగీ భారినపడిన వ్యక్తి శ‌రీరానికి కావాల్సిన నీరును త‌ప్ప‌ని స‌రిగా తాగాలి. అప్పుడే శ‌రీరంలోని వ్య‌ర్థ‌ప‌దార్దాలు బ‌య‌ట‌కు వెళ్లి ఆరోగ్యం కుదిట‌ప‌డుతుంది. కొత్తిమీర ఆకులతో జ్యూస్ తాగడం డెంగీ రోగికి చాలా మంచిది. కొత్తిమీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని బాక్టీరియాతో పోరాడగల శక్తి దీనికి పుష్క‌లంగా ఉంది. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, పండ్లు ఎక్కువ‌గా తినాలి. ఆకు కూర‌లు తిన‌డం వ‌ల్ల రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో ప్లేట్ల‌ట్స్ అభివృద్ధి చెందుతాయి. డెండీ నివార‌ణ‌కు ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు గ్రేట్‌గా ప‌నిచేస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker