H3N2 వైరస్ ప్రభావం వీరిపై అధికం, నిర్లక్ష్యం చేస్తే మాత్రం అంటే సంగతులు.

ఇన్ఫ్లుఎంజాతో అనారోగ్యంతో ఉన్న పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. మార్చి నెలాఖరు నాటికి జ్వరల కేసులు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో ఫ్లూ విజృంభిస్తుంది. మొదట జనవరి నుండి మార్చి వరకు, రెండవది రుతుపవనాలు ముగిసిన తర్వాత. భారతదేశంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న సమయం ఇది. అయితే కరోనా సృష్టించిన బీభత్సంనుంచి ఇంకా తేరుకోక ముందే.. దేశంలో ఇన్ ఫ్లూయెంజా వైరస్ విజృంభిస్తోంది.
హెచ్3ఎన్2 వైరస్, ఎనిమిది హెచ్1ఎన్1 వైరస్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. H3N2 సహా సీజనల్ ఇన్ ఫ్లూయెంజా నుండి వచ్చే కేసులు మార్చి చివరి నుండి తగ్గుతాయని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది.
ప్రతి సంవత్సరం భారతదేశం కాలానుగుణ ఇన్ ఫ్లూయెంజా రెండు సీజన్లలో విజృంభిస్తుంది. ఒకటి జనవరి నుండి మార్చి వరకు.. రెండోది రుతుపవనాల అనంతర కాలంలో సీజనల్ ఇన్ ఫ్లూయెంజా వల్ల వచ్చే కేసులని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజృంభిస్తున్న హాంకాంగ్ ఫ్లూ.. H3N2 వైరస్ మార్చి నెలాఖరు నుంచి తగ్గే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ హాంకాంగ్ ఫ్లూ వైరస్ల వల్ల తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.
ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. కొన్ని నెలలలో కేసులు పెరుగుతాయని తెలిపింది. ఎవరిపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందంటే.. సీజనల్ ఇన్ఫ్లుఎంజా విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్దులు, ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ..రోగుల వర్గీకరణ, చికిత్స ప్రోటోకాల్, కేంద్ర రాష్ట్రాలకు వెంటిలేటరీ నిర్వహణపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ నియమ నిబంధనలు కేంద్ర మంత్రిత్వ శాఖ వెబ్సైట్ (www.mohfw.nic.in) , NCDC (ncdc.gov.)లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ వైరస్ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్స్ చేసిన ఒసెల్టామివిర్ అనే టీకాను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఔషధం పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 2017లో డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ షెడ్యూల్ హెచ్1 ప్రకారం ఒసెల్టామివిర్ అమ్మకానికి ప్రభుత్వం అనుమతించింది.