Health

జీడిప‌ప్పు తినేముందు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.

జీడిపప్పులో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పును రోజూ తినడం వల్ల శరీరంలో ఐరన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం లోపాలను తీర్చుకోవచ్చు. జింక్ లోపాన్ని తీర్చడానికి జీడిపప్పు తినవచ్చు. జీడిపప్పు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అయితే స‌హ‌జంగా చాలా మంది జీడిప‌ప్పు తిన‌డానికి ఇష్ట‌పుడుతుంటారు. వంట‌ల్లో ర‌చికి జీడిప‌ప్పు బాగా ఉప‌యోగ‌డ‌ప‌తుంది.

మ‌రి ఎక్కువ‌గా జీడిపప్పుని స్వీట్స్‌ రూపంలోనే తీసుకుంటాం. అయితే జీడిప‌ప్పు వంట‌ల్లోనే కాకుండా రోజుకు గుప్పెడు మోతాదులో తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. జీడిప‌ప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. ఇవి గుండెజబ్బు ప్రమాదం నుంచి ర‌క్షిస్తుంది. ఇది గుండె కండరాలను రిలాక్స్‌ చేస్తుంది.

అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్ర‌తి రోజు జీడిప‌ప్పు తిన‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ పోతాయి. మానసిక సమస్యలతో బాధ‌ప‌డేవారికి జీడిప‌ప్పు బాగా స‌హాయ‌ప‌డుతుంది. అలాగే కోలన్ క్యాన్సర్ పెరుగుదల నివారణలో జీడిపప్పు ప్ర‌ధాన పాత్ర పోసిస్తుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యవంతమైన అభివృద్ధి కోసం జీడిపప్పులోని మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, విటమిన్‌ కె అత్యావశ్యకంగా ఉంటాయి.

ఎముకల నిర్మాణంలో మెగ్నీషియమూ ప్రధానపాత్రను పోషిస్తుంది. రోజూ జీడిపప్పును తింటే నేత్ర సంబంధ సమస్యలు త‌గ్గుతాయి. జీడిపప్పులో ఐరన్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. రోగనిరోధక వ్యవస్థ పెంచ‌డానికి, మెద‌డు ప‌నితీరు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డానికి జీడిప‌ప్పు గ్రేట్‌గా ప‌నిచేస్తుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు కూడా త‌మ రెగ్యుల‌ర్ డైట్‌లో జీడిప‌ప్పును చేర్చుకోవ‌డం చాలా మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker