చైతన్యతో ఎఫైర్ పై అసలు విషయం చెప్పిన శోభిత.

కుర్రభామ శోభితా దూళిపాళకు రీసెంట్ గా ‘పొన్నియిన్ సెల్వన్’తో అలరించిన విషయం తెలిసిందే. తెలుగు బ్యూటీ అయినప్పటికీ తన కేరీర్ ను మాత్రం బాలీవుడ్ లోనే మొదలు పెట్టింది. ‘రామన్ రాఘవ్ 2.0’తో వెండితెరకు పరిచయం అయ్యింది. అయితే సినీ తారలపై తరచూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.
ముఖ్యంగా.. వారి వ్యక్తిగత విషయాలు, అందునా డేటింగ్‌కి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు, అవి బాగా వైరల్ అవుతాయి. ఇప్పుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళపై కూడా అలాంటిదే ఒక రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. కొంతకాలం నుంచి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని విస్త్రృతమైన ప్రచారం జరుగుతోంది. ఒకసారి లండన్ వెకేషన్లో, మరోసారి రెస్టారెంట్లో ఇద్దరూ జంటగా కనిపించడంతో.. ఈ డేటింగ్ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది.

వీళ్లిద్దరి మధ్య పక్కాగా పప్పులు ఉడుకుతున్నాయని అందరూ దాదాపు ఫిక్స్ అయ్యారు. అయితే.. ఇది నిజమా? కాదా? అన్నది స్వయంగా ఆ సెలబ్రిటీల నోట వినాలని ప్రజలు తహతహలాడుతున్నారు. ఈ వ్యవహారంపై నాగచైతన్య ఇంతవరకూ స్పందించలేదు కానీ, తాజాగా శోభితా మాత్రం షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఈ లవ్ రూమర్‌కి సంబంధించి తనకు ప్రశ్న ఎదురవ్వగా.. శోభితా ధూళిపాళ ఇలా స్పందించింది.

”ఇప్పుడు నేను మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. రీసెంట్గా మణిరత్నం డైరెక్షన్లో పొన్నియన్ సెల్వన్ వంటి చారిత్రాత్మక సినిమా చేశాను. ఆ సినిమాలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలకు నేను డ్యాన్స్ చేశాను. అది నాకు అత్యద్భుతమైన అనుభవం. ఇంత మంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు.. ఎవరో ఏదో అంటున్నారని, దాని గురించి ఆలోచిస్తూ ఫీలైపోవాల్సిన అవసరం లేదు. అసలు నాకు ఆ రూమర్‌తో సంబంధమే లేనప్పుడు, నేను ఏ తప్పూ చేయనప్పుడు..

అర్జెంట్‌గా దాని మీద క్లారిటీ ఇవ్వాలని ఎందుకు అనిపిస్తుంది? నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను” అంటూ సమాధానం ఇచ్చింది. అంటే.. తనకు, నాగచైతన్యకు మధ్య ఎలాంటి ఎఫైర్ నడవట్లేదని అమ్మడు పరోక్షంగా క్లారిటీ ఇచ్చిందన్నమాట! మరి.. లండన్‌లో ఇద్దరు కలిసి కెమెరాకి చిక్కిన ఫోటోల కథేంటి?