News

శోభితతో పెళ్ళికి నాగచైతన్యకు ఎన్ని కట్నకానుకలు ఇచ్చారో తెలుసా..?

నిశ్చితార్థం విషయాన్ని ఆఖరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచిన అక్కినేని, దూళిపాళ్ల కుటుంబ సభ్యులు, వివాహ వేదికపై కూడా గోప్యత పాటిస్తూ వచ్చారు. కానీ.. ఎట్టకేలకి తేదీ, ప్లేస్ వార్త వెలుగులోకి వచ్చేసింది. అయితే మోడల్ శోభిత ధూళిపాళతో ఇన్నాళ్ల పాటు సీక్రేట్ రిలేషన్ మెంటైన్ చేసాడు నాగచైతన్య. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో నాగ చైతన్య , శోభితా ధూళిపాళ చాలా ప్రైవేట్‌గా ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ఆ ఫోటోలు నెట్టింట సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల డిసెంబర్ 4, 2024న వివాహం జరుగుతుందని Ottplayలో నాగ చైతన్య-శోభిత పెళ్లి వివరాలు బయటకు వచ్చాయి. అందుకు నిదర్శనంగా శోభిత మాత్రం పసుపు దంచుతున్న ఫొటోలను షేర్ చేసింది. ఇక నాగార్జున సొంత అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందని నాగ చైతన్య సన్నిహితులు, సినీ ప్రముఖులు చెబుతున్నారు. స్టూడియో ఫ్లోర్‌లలో ఒకదానిలో ఒక చిన్న సెట్ ఏర్పాటు చేస్తున్నారట.

అయితే వీరి వివాహానికి కేవలం కొద్దిమంది అతిథులు మాత్రమే వస్తున్నారని సమాచారం. చైతు, శోభిత ఇద్దరూ ఆడంబరమైన పెళ్లిని కోరుకోలేదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ జంట పెళ్లికి సంబంధించిన వార్త మరొకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. స్టార్ జంట పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. నాగచైతన్యకు కట్నం కింద శోభిత కుటుంబం ఆడీ కారుతో పాటు బైక్‌ను ఇస్తున్నారంట. ఇవే కాకుండా హైదరాబాద్‌లో ఓ విల్లా, బంగారం ఇస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తమ కొడుకును జీవితకాలం జాగ్రత్తగా చూసుకుంటే చాలని నాగార్జున శోభిత తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పేశారు. ఇదే కాదు చక్కటి ఇల్లాలుగా నడుచుకోవాలని ముందే చెప్పేసారంట. శోభిత ధూళిపాళ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి. కొన్నేళ్ల కిందటే వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో శోభిత నటిస్తోంది. తెలుగు సినిమాల్లో నటించడం చాలా తక్కువ. ఏదేమైనప్పటికీ అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వెళ్తుండటం మాత్రం శోభిత అదృష్టమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker