మీ పిల్లలు మొబైల్ ఎక్కువ చూస్తున్నారా..? భవిష్యత్తులో ఏమవుతుందంటే..?
తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించడానికి.. కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించాలి. పిల్లల చేత బలవంతంగా ఏపనీ చేయించకూడదు. వాళ్ళ చేతిల్లోంచి ఫోన్లు లాక్కొవడం కాకుండా వాళ్ళే ఫోన్లు, టీవీలు వదిలేసేటట్లు చేయాలి. అయితే తల్లిదండ్రులు తమ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త బయటకు వచ్చి పిల్లలతో గడపాలి.
వారికంటూ కొంత సమయం కేటాయించాలి. రాత్రి భోజన సమయం లేదా నిద్రవేళకు ఒక గంట ముందు పిల్లలతో పాటు వారి రోజువారీ షెడ్యూల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది వారిని కొంతకాలం పాటు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంచడమే కాకుండా ఆ పరికరాలను ఉపయోగించి వారు ఎంత సమయం గడుపుతున్నారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి వారి స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసేలా చర్యలు తీసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండమని వారిని బలవంతం చేయడానికి బదులుగా, వారి స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి గల కారణాలను వివరించాలి. వారి ఆరోగ్యంపై దాని ప్రతికూల పరిణామాల గురించి తెలుసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల అధిక వినియోగం నుంచి తమను తాము ఆపుకోవచ్చు. విశ్రాంతి సమయాన్ని గడపడానికి ఇంటర్నెట్ అత్యంత సౌకర్యవంతమైన ఎంపికలలో ఒకటిగా ఉన్నందున ఇతర సరదా కార్యకలాపాల గురించి అవగాహన కల్పించాలి.
వారి అభిప్రాయాలను మాట్లాడే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. ఇష్టాలు అయిష్టాల గురించి తెలుసుకోవాలి. పుస్తకాలు చదవడం, పెయింటింగ్, పాటలు పాడటం, ఎలక్ట్రానిక్ పరికరాలపై సమయం గడపడానికి కొన్ని ఉత్తమ ప్రత్యామ్నాయాలు చేయవచ్చు. వీలైనప్పుడల్లా పిల్లలను బయటకు తీసుకెళ్లాలి. వారు ప్రపంచాన్ని అస్వాదించాలని చెప్పాలి.
ఎందుకంటే ఇది వారిని బిజీగా ఉంచగలిగే ఉత్తమమైన ఎంపిక. ఎలక్ట్రానిక్ పరికరాలపై సమయాన్ని వృథా చేయకూడదనుకుంటే, వారు కొంత సమయం ఆరుబయట గడిపేలా చూసుకోవాలి. అయితే నియమాలను అనుసరించమని బలవంతం చేస్తే, అది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకు బదులుగా స్క్రీన్ సమయానికి సమయం సెట్ చేయాలి. అందుకు కట్టుబడి ఉంటే రివార్డ్‌లను ఆఫర్ చేయాలి. ఇలా చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.