Health

పిల్లల్ని కనడానికి సరైన సమయం ఎదో తెలుసా..?

నిజానికి, మగవారు కూడా ఆరోగ్యమైన పిల్లలను కనడానికి సరైన వయస్సు అవసరమనే అవగాహన కలిగి ఉండాలి. ఒక అధ్యయనం ప్రకారం, 40 ఏళ్ళకు పైబడిన భాగస్వాములున్న స్త్రీలలో, గర్భధారణకి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ 25 ఏళ్ల వయస్సు ప్రాంతంలో భాగస్వాములున్న స్త్రీలు తొందరగా గర్భవతులవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వాస్తవాలు ఇదిగో. అయితే ఇదివరకటి రోజుల్లో లాగా కాకుండా.. ఇప్పుడు పెళ్లైన కొత్తజంట.. పిల్లల్ని కనడానికి పక్కా ప్లాన్ చేసకుంటున్నారు.

మీరు పిల్లల్ని కనడానికి, పెంచడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లల్ని కనండి. ఇది ఈ సమయానికి జరగాలి.. పెళ్లి ఇప్పుడు చేసుకోవాలి.. పిల్లల్ని ఇప్పుడు కనాలి.. ఇవే కాకుండా.. వేరే వేరే వ్యక్తులకు వేర్వేరు గోల్స్ ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు కొంతమందికి కెరీర్ మొదటి ప్రాధాన్యత.. ఆ తరువాతే పెళ్లి.. పిల్లలు. మరికొందరు జీవితంలో పిల్లలే వద్దనుకుంటారు. అది వారి వారి వ్యక్తిగత విషయం. కాబట్టి దానిపై ఒత్తిడి చేయవద్దు.

మీ ప్రాధాన్యతలను తెలుసుకుని, ఏదేమైనా వాటికే కట్టుబడి ఉండండి. పిల్లల పెంపకం ఖరీదైనది. వారికి అవసరమైన ప్రతి చిన్న వస్తువు.. అంటే వారి బొమ్మల నుండి చదువు వరకు మీరే చూసుకోవాలి. వారికి అవసరమైనంతవరకు ఎలాంటి చికాకులు లేకుండా అందించగలగాలి. దీనికోసం మీరు ఆర్థికంగా స్థిరంగా లేకుంటే, మీరు పిల్లలు కనడానికి సిద్ధంగా లేరన్నట్టు. పేరెంట్‌గా మారడం, అన్నింటికంటే.. ఎంత భావోద్వేగమైనదో అంతే ఆర్థికపరమైన నిర్ణయం కూడా.

వయసు పెరిగిపోతే పిల్లల్ని కనలేరని సమాజంలో ఓ వాదన వినిపిస్తుంది. అయితే మీరు ఇప్పుడు పిల్లలు వద్దూ అనుకుంటే ఓ సారి మీకున్న సంతానసామర్థ్యాన్ని టెస్ట్ చేయించుకోండి. దాన్ని బట్టి పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో పిల్లల్ని కనడం వాయిదా వేయాలా? లేక తొందరపడాలా? మీకు అర్థమైపోతుంది. పిల్లల్ని పెంచడం మామూలు విషయం కాదు. ఉమ్మడి కుటుంబాల్లో అది తెలియకుండా జరిగిపోతుంది.

కానీ భార్యా, భర్త మాత్రమే ఉండే నేటి జీవితాల్లో అది పెద్ద ఛాలెంజ్. అందుకే పిల్లల పెంపకంలో భార్యా.. భర్త.. ఇద్దరి పాత్రా ఉండాలి. దీనికోసం భాగస్వాములిద్దరూ రెడీగా ఉన్నప్పుడే ఆలోచించండి. పిల్లల్ని పెంచడం మామూలు విషయం కాదు. ఉమ్మడి కుటుంబాల్లో అది తెలియకుండా జరిగిపోతుంది. కానీ భార్యా, భర్త మాత్రమే ఉండే నేటి జీవితాల్లో అది పెద్ద ఛాలెంజ్. అందుకే పిల్లల పెంపకంలో భార్యా.. భర్త.. ఇద్దరి పాత్రా ఉండాలి. దీనికోసం భాగస్వాములిద్దరూ రెడీగా ఉన్నప్పుడే ఆలోచించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker