Health

పిల్లలకు ఈ ఆహారం పెడితే కళ్లద్దాల అవసరం జీవితంలో రాదు.

పిల్ల‌ల‌కు రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాలను ఇవ్వాలి. వారికి దృష్టి లోపాలు చాలా వ‌ర‌కు పోష‌కాహార లోపాల వ‌ల్ల‌నే వ‌స్తాయి. క‌నుక అన్ని విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ క‌లిగిన ఆహారాల‌ను వారికి రోజూ ఇవ్వాలి. ముఖ్యంగా దృష్టి లోపాలు రాకుండా ఉండేందుకు గాను విట‌మిన్ ఎ ను అందించాల్సి ఉంటుంది. విట‌మిన్ ఎ ఎక్కువ‌గా యాపిల్స్, కోడిగుడ్లు, ట‌మాటాలు, న‌ట్స్ వంటి ఆహారాల్లో ల‌భిస్తుంది. అలాగే పాల‌ను కూడా తాగించ‌వ‌చ్చు. అయితే చిన్నపిల్లల సున్నితమైన కళ్లు ఈ వయసులోనే ఎందుకు దెబ్బతింటున్నాయి. దానికి తప్పు తల్లిదండ్రులదే.

చేతిలో ఫోన్‌ పెడితే ఏడ్వకుండా అన్నంతింటాడని వారికి చిన్నప్పటి నుంచే ఫోన్‌ అలావాటు చేసేశారు.. ఇక ఫోన్‌ లేకుండా వారు ఉండలేనంతలా అయిపోయారు. అరే బయటకు వెళ్లినా వారికి ఆ ఫోన్‌ కావాల్సిందే..లేదంటే గోలపెడతారు.. వెరసి చిన్నవయసులోనే కంటిచూపు తగ్గిపోతుంది. దీనికితోడు తినే తిండి. పోషకాహార లోపం వల్ల కళ్లు దెబ్బతింటాయి. చేపలు.. నూనె చేపల వినియోగం కంటి చూపును పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మీ ఆహారంలో సాల్మన్ వంటి చేపలను చేర్చుకోవడం వల్ల ఒమేగా-3 లభిస్తుంది.

సాల్మన్ కాకుండా, ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, చిన్న సముద్ర చేపలను కూడా తినవచ్చు. క్యాప్సికమ్ – కంటి చూపును మెరుగుపర్చడానికి మీ ఆహారంలో రెడ్ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్‌ను చేర్చండి.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వినియోగం వల్ల కళ్ల రక్తనాళాలు బలపడతాయి. రెడ్ బెల్ పెప్పర్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఇది కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా కళ్లలో విటమిన్లు A, E లోపం ఉండదట.

క్యారెట్.. క్యారెట్ తినడం కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు.. కానీ కొందరే పాటిస్తున్నారు. తక్కువ బడ్డెట్‌లో ఆరోగ్యానికి, అందానికి మేలు చేసేవి కొన్నే ఉంటాయి. అందులో క్యారెట్‌ మొదటిది.. ఇది మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే బీటాకెరోటిన్, విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటితో పాటు..డ్రై నట్స్‌, ఫ్రూట్స్‌ వంటివి కూడా పిల్లలకు తరచూ పెడుతూ ఉంటే శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి. వీలైనంత వరకూ స్ర్రీన్‌ చూడకుండా ఉండేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం ఉత్తమం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker