Health

Cholesterol: శరీరంలోఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీకు తొందరలోనే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు రావొచ్చు.

Cholesterol: శరీరంలోఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీకు తొందరలోనే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు రావొచ్చు.

Cholesterol: మంచి కొలస్ట్రాల్‌ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ అంటే LDL పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. కొన్నిసార్లు అధిక కొలెస్ట్రాల్ రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది.

అయితే మీరు మీ వేలు గోర్ల ను చూడటం ద్వారా మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను గుర్తించవచ్చు. ముందే.. తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. రక్త ప్రసరణకు ఆటంకం కలిగితే ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. వాస్తవానికి.. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది.. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్.. చెడు కొలెస్ట్రాల్‌ను LDL అంటారు.

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే లక్షణాలు త్వరగా కనిపించవు.. ఇది రక్త నాళాలలో పేరుకుపోతుంది.. శరీరంలోని కొన్ని భాగాలలో దాని లక్షణాలను చూపుతుంది. అవేంటో తెలుసుకోండి.

Also Read: నోటి దుర్వాసన పోవాలని మౌత్ వాష్ వాడుతున్నారా..?

గోర్లు పసుపు రంగులోకి మారడం: గోర్లపై పసుపు రంగు మచ్చలు ఏర్పడటాన్ని శాంతోమాస్ అంటారు. మీ గోరు ఇలా పసుపు రంగులోకి మారినట్లయితే, మీ శరీరంలో హానికరమైన కొవ్వు పేరుకుపోయినట్లు అర్థం.. గోర్లకు రక్త ప్రసరణ తగ్గితే గోరు పసుపు రంగులోకి మారుతుంది. ఇది సాధారణంగా అధిక LDL కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తుల లక్షణం.

ఈ పసుపు మచ్చలు గోర్లు, మోచేతులు, గోళ్ల మధ్య, కొంతమందిలో ఎడమ లేదా కుడి కాలు మీద కనిపిస్తాయి. గోర్లకు రక్తప్రసరణ సరిగా జరగకపోతే గోళ్లు నీలం రంగులోకి మారుతాయి. గోర్లు నీలం రంగులోకి మారితే రక్తనాళాల్లో సమస్య ఉందనడానికి సంకేతం.

Also Read: షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.

కాబట్టి మీ గోర్లు నీలం రంగులోకి మారితే మీ శరీరంలో కొవ్వు పెరిగిందని అర్థం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడితే గోర్లలో నొప్పి ఉండటంతోపాటు మంట ఉంటుంది.

కాబట్టి గోర్లలో నొప్పి వస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, శరీరంలోని అనేక భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరగకుండా చేస్తుంది.. తద్వారా, సరైన రక్త ప్రవాహం లేకుండా, వేలు గోర్లు చల్లగా మారుతాయి..

రక్త ప్రసరణ దాదాపుగా ఆగిపోయినప్పుడు, గోర్లు చల్లగా, నిర్జీవంగా మారుతాయి.: ఈ లక్షణం కొందరిలో కనిపిస్తుంది. గోళ్లపై డార్క్ స్ట్రీక్స్ శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌కు సంకేతం. దీనినే స్ప్లింటర్ హెమరేజ్ అంటారు. ఈ నల్లటి గీతలు గోర్లపై కనిపిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker