Health

Cholesterol: ఈ ఆహారపదార్థాలు తింటే చాలు, చెడు కొలెస్ట్రాల్‌ వెంటనే కరిగిపోతుంది.

Cholesterol: ఈ ఆహారపదార్థాలు తింటే చాలు, చెడు కొలెస్ట్రాల్‌ వెంటనే కరిగిపోతుంది.

Cholesterol: అధిక కొవ్వు పదార్ధాలు , నిశ్చల జీవనశైలిని నడిపించే వ్యక్తులలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణాలను ముందుగానే గుర్తించడం , చికిత్స చేయడం వలన రోగి తీవ్రమైన బాధితునిగా మారకుండా నిరోధించవచ్చు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే.. అది తీవ్రమైన రోగాలకు దారితీస్తుంది. కొంచెం కొలెస్ట్రాల్‌ ఉండటం వల్ల ఏం కాదు.. కానీ అది క్రమంగా ఎక్కువైతే.. ముందు బరువు పెరుగుతారు, ఆ తర్వాత.. గుండె చుట్టూ చెడు కొలెస్ట్రాల్‌ ఒక కవచం నిర్మించుకుంటుంది.. పైప్‌లైన్‌లో ఏదైనా అడ్డుపడితే.. నీటి సరఫరా కష్టం అవుతుంది.

Also Read: రోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే చాలు

అచ్చం అలానే.. గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో.. ఈ చెడు కొలెస్ట్రాల్‌ అడ్డుపడటంతో.. హార్ట్‌కు రక్తం సరిగ్గా అందదు.. గుండె పని.. వచ్చే రక్తాన్ని పంపింగ్‌ చేస్తూ.. కిందకు మీదకు తిప్పడం.. ఈ మార్గంలో.. ఈ చెడు కొలెస్ట్రాల్‌ ఉండటం వల్ల.. హార్ట్‌కు పని ఎక్కువ అవుతుంది..చాలా కష్టపడాల్సి వస్తుంది..అలాకొన్నాళ్లు.. గుండె అలిసిపోయి.. ఆగిపోతుంది.. సీన్‌ కట్‌ చేస్తే.. హార్ట్‌ ఎటాక్‌.. చెడు కొలెస్ట్రాల్‌ అనే శత్రువు ఎంత పని చేస్తుందో మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమయిందా.. అందుకే ఇది రానే కూడదు. ఒకవేళ బాడీలో ఈ చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే.. దాన్ని కరిగించాలి.

ఒకటి వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించువచ్చు, రెండు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలు ఏంటో తెలుసుకుని అవి తినాలి. పైప్‌లైన్ క్లియర్‌ అవుతుంది.. కాలువకు ఎలాంటి అడ్డం లేకపోతే. పొలానికి నీరు ఎంత స్పీడ్‌గా పారుతుందో..అలా మీ గుండె దాని పని అంత స్పీడ్‌గా చేసుకుంటుంది. వోట్స్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఓట్స్‌లో కాల్షియం, ప్రొటీన్, ఐరన్, జింక్, థయామిన్ మరియు విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు పీచుపదార్థాలు అధికంగా ఉండటం వల్ల ఓట్స్‌ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

Also Read: షుగర్ ఉన్నవారు ఈ పండు తరచూ తింటే చాలు.

ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ ఉదయం ఓట్ మీల్ తినవచ్చు. ఈ జాబితాలో అవోకాడో రెండవ స్థానంలో ఉంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గడానికి రోజుకు ఒక అవకాడో తినడం మంచిది. జాబితాలో చివరిది నట్స్. విటమిన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన గింజలను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తపోటును నియంత్రించవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker