కొబ్బరిపాలతో వండిన అన్నం తింటే రాత్రికి స్వర్గమే. ఎలాగంటే..?
మనం అన్నంతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో కూడా త్వరితగతిన చేసుకోగలిగే ఎన్నో రైస్ రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. రుచికరంగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, పులిహోర కలిపేయచ్చు లేదా ఆరోగ్యపరంగానూ ఎంతో అద్భుతమైన ఖిచ్డీ చేసుకోవచ్చు. ఈ ఖిచ్డీని కూడా మనకు నచ్చినట్లుగా కూరగాయలతో, పప్పులతో కలిపి చేసుకోవచ్చు.
రాజ్మా అన్నం మరొక ఆప్షన్. అయితే అన్నం వండే విధానాన్ని బట్టి అదొక కొత్త వంటకం అవుతుంది. మీరు టొమాటో రైస్, కొబ్బరి అన్నం వంటి రుచులు చూసే ఉంటారు. ఎప్పుడైనా కొబ్బరిపాలతో అన్నం వండుకొని చూశారా? ఇది కూడా చాలా తక్కువ సమయంలో సులభంగా వండుకోలిగే వంటకం. మీరూ ప్రయత్నించాలనుకుంటే, ఇక్కడ కొకొనట్ మిల్క్ రెసిపీని అందిస్తున్నాం, ఇలా ఒకసారి చేసుకొని తినండి. కొబ్బరి పాల ఉపయోగాలు.. కొబ్బరిపాలు చాలా ఆరోగ్యకరమైనవి.
ఇవి ఎముకలకు చాలా బలాన్నిస్తాయి. కాల్షియం దీనిలో అధికంగా ఉంటుంది. ఈ పాలలో కొవ్వును కరిగించే గుణాలు ఎక్కువ. కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునే వారు దీన్ని మెనూలో చేర్చుకోవచ్చు. వారానికోసారైనా కొబ్బరిపాలతో వండే వంటకాలను తినడం చాలా అవసరం. వీటిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.
కాబట్టి బయటి నుంచి శరీరంపై దాడి చేసే వైరస్, బ్యాక్టిరియాలతో పోరాడే శక్తిని అందిస్తుంది. కొబ్బరిపాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే దీని వల్ల బరువు తగ్గడం సులువు. ఈ పాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మన శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం. కొబ్బరిపాలతో జుట్టుకు మసాజ్ చేస్తే చాలా మంచిది. ఈ పాలలో సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చాలా సమస్యలకు చెక్ పెడుతుంది. నొప్పులు,క్యాన్సర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.