News

కమెడియన్ లక్ష్మీపతి కొడుకు టాలీవుడ్‌లో పెద్ద హీరో అని ఎవరో తెల్సా..?

కమెడియన్ లక్ష్మీపతి… కితకితలు, అల్లరి, ఆంధ్రుడు, పెదబాబు వంటి సినిమాల్లో తనదైన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. మరి ముఖ్యంగా సునీల్ లక్ష్మీపతి కాంబినేషన్ అంటే మరో లెవల్ అని చెప్పవచ్చు. కడుపుబ్బ నవ్వుకోవచ్చు. అలాంటి లక్ష్మీపతి 2008లో అకాల మరణం చెందారు. అయితే దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు ఈ దివంగత నటుడు.

లేటు వయస్సులో ఇండస్ట్రీకి అడుగుపెట్టినా తన మర్క్ వేసేశారు. ఆయన, సునీల్‌ కాంబినేషన్‌లో చేసిన కామెడీ సీన్స్‌ చూస్తే ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకుంటారు. అయితే లక్ష్మీపతి తొలుత రచయితగా కెరీర్ ఆరంభించారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చంద్రలేఖ సినిమాకు రచనా సహకారం అందించారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన చూడాలని ఉంది చిత్రంతో నటుడిగా మారారు.

అయితే ఆయన బ్రేక్ వచ్చింది మాత్రం ఈవీవీ తీసిన ‘అల్లరి’ సినిమాతోనే. కాగా లక్ష్మీపతికి సీనియర్ డైరెక్టర్ శోభన్ స్వయానా తమ్ముడు అవుతాడు. మహేశ్‌బాబు ‘బాబీ’, ప్రభాస్‌ ‘వర్షం’ సినిమాలకు శోభన్ దర్శకత్వం వహించారు. కాగా 2008లో శోభన్ అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. ఆయన చనిపోయిన నెల రోజుల్లోనే కుంగుబాటుకు గురై లక్ష్మీపతి కూడా మరణించారు.

శోభన్ కొడుకులు ఇద్దరూ ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు సంతోష్ శోభన్ 2011లో గోల్కొండ హైస్కూల్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. 2018లో పేపర్ బాయ్ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ఏక్ మినీ కథ, ‘అన్నీ మంచి శకునములే’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. అతని తమ్ముడు సంగీత్ శోభన్ కూడా నటుడిగా రాణిస్తున్నారు. మ్యాడ్ సినిమాలో ఒక హీరోగా నటించాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker