Cool Drink: బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా..! ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు.

Cool Drink: బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా..! ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు.
బిర్యానీ తినేటప్పుడు చాలామంది దాహానికి లేదా ఫ్రెష్ ఫీలయ్యేలా ఉండేందుకు కూల్ డ్రింక్ తాగుతారు. అయితే ఇది కేవలం అలవాటుగా మాత్రమే ఉండి, ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. బిర్యానీ అనేది స్పైసీ, ఆయిలీ ఫుడ్. అయితే బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా బిర్యానీ లాంటి మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలవుతుంది. దానికి తోడు కూల్ డ్రింక్ తీసుకుంటే అందులోని యాసిడ్స్ జీర్ణ వ్యవస్థలో ఆమ్లాన్ని మరింత పెంచుతుంది. దీంతో ఇది గ్యాస్, గుండెలో మంట సమస్యకు దారి తీస్తుందని అంటున్నారు. మొదట్లో బాగానే అనిపించినా దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది.
Also Read: మన దేశంలో సగం మంది పురుషులు ఈ వ్యాధితో పదపడుతున్నారు.
జీర్ణ సంబంధిత సమస్యలకు సైతం ఇది దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. కూల్ డ్రింక్‌లో ఉండే కార్బనేషన్ జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది అజీర్తి, పొట్టలో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది మరింత ప్రమాదానికి కారణమవుతుంది. బిర్యానీలో ఉండే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు.. కూల్ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెర స్థాయిలు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఈ బత్తాయి పండ్లు తిన్నాక, వీటిని అస్సలు తినకూడదు.
కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్‌తో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. బిర్యానీలో ఉన్న ప్రోటీన్లు, కొవ్వులు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. కూల్ డ్రింకులతో పాటు తీసుకోవడం వలన శరీరంలో టాక్సిన్ లు ఎక్కువ అవుతాయి, ఇది కాలేయంతో పాటు కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది.
Also Read: ఇలాంటి బియ్యం విషంతో సమానం..!
కూల్ డ్రింక్స్‌లో అధికంగా ఉండే చక్కెరలు, కేలరీలు శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమవుతాయి. అలాగే బిర్యానీలోని కొవ్వు ఒబేసిటీ, అధిక రక్తపోటుకు దారి తీస్తాయి. దీర్ఘకాలంలో ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటానికి దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.