కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..? భవిష్యత్తులో ఈ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు ఒకటి.నిజానికి కూల్ డ్రింక్స్‌లో ప్రధానంగా షుగర్ మరియు గ్యాస్ ఉంటుంది.అయితే కూల్ డ్రింక్స్ తాగినప్పుడు అందులో ఉండే షుగర్ కంటెంట్.మన శరీరంలో కొవ్వుగా మారి బరువును అమాంతం పెంచేస్తుంది. అలాగే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్.శరీరంలో డోపమైన్ అనే కెమికల్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ కూల్ డ్రింక్స్ అంటే ఎంతగా ఇష్టపడతారో మనందరికీ తెలిసిందే.
కొంచెం ఎండగా ఉన్నా సరే కూల్ డ్రింక్ తాగాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల లాభమా..? నష్టమా..? అనే ప్రశ్నకు వైద్యులు, శాస్త్రవేత్తలు కూల్ డ్రింక్ లను ఎంత ఎక్కువగా తాగితే అంత నష్టమని చెబుతున్నారు. కూల్ డ్రింక్ లో ప్రధానంగా చక్కెర, గ్యాస్ ఉంటుంది. కూల్ డ్రింక్ లో ఏడు చంచాల చక్కెరకు సమానమైన తీపి ఉంటుంది. వైద్యులు ఎక్కువగా కూల్ డ్రింక్ లను తాగితే ప్రాణాలకే ముప్పు అని చెబుతున్నారు.
తరచూ కూల్ డ్రింక్ లను తాగేవారు ఊబకాయం బారిన పడతారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది. రోజుకు లీటర్ కు పైగా కూల్ డ్రింక్ తాగితే గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉంది. సాధారణంగా ఎక్కువ మొత్తంలో చక్కెర తీసుకుంటే వాంతులు అవుతాయి.
అయితే కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్పారిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది. కూల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ శరీరంలో క్యాల్షియంను తగ్గించి రక్తపోటును పెంచుతుంది. కూల్ డ్రింక్స్ ఉత్పత్తిదారులు రంగు కోసం వాటిలో కొన్ని కెమికల్స్ ను కలుపుతారు. తరచూ కూల్ డ్రింక్స్ తాగితే డీ హైడ్రేషన్ తో పాటు మూత్ర సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. కూల్ డ్రింక్స్ లో ఉండే గ్యాస్ ఆకలి కాకుండా చేయడంతో పాటు దంత సమస్యలకు కారణమవుతుంది. కూల్ డ్రింక్స్ తాగే వారిలో పళ్లపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోయి దంతక్షయం, చిగుళ్ల సమస్యలు వస్తాయి. కడుపులో ఎక్కువగా గ్యాస్ చేరితే కడుపు ఉబ్బుతుంది. అందువల్ల వీలైనంత వరకు కూల్ డ్రింక్ లకు దూరంగా ఉంటే మంచిది.