Health

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ‌గా ఉంటే ఆ సంసార జీవితం సుఖంగా సాగదా..?

భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ 5 అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఉన్నా మంచిది కాద‌ని.. ఇలాంటి జంట‌లు కూడా విడాకులు తీసుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉంటాయ‌ని అంటున్నారు. ఈ మేర‌కు హౌజ్ హోల్డ్‌, ఇన్‌క‌మ్ అండ్ లేబ‌ర్ డైనిమ‌క్స్ ఇన్ ఆస్ట్రేలియా అనే అధ్య‌య‌నంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

అయితే చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకున్న యువతీ యువకులు వారి మధ్య ఉన్న వయసు తేడా ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటారు.కనీసం ఇద్దరి మధ్య రెండు నుంచి మూడేళ్ల తేడా మాత్రమే చూసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం పది సంవత్సరాలు లేకపోతే చేసుకోరు. కొందరు అమ్మాయిలు వాళ్ళ కంటే చాలా పెద్ద వాళ్లను, మరికొందరేమో సమాన ఏజ్ ఉన్న వాళ్ళని ఇష్టపడతారు.

కానీ భార్యాభర్తల మధ్య కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాల గ్యాప్ ఉన్నటువంటి దంపతుల మధ్య అపార్థాలు, గొడవలు, వాదనలు చాలా తక్కువగా ఉంటాయని ఒక సర్వేలో తేలింది. ఇందులో ఎవరో ఒకరు మాత్రం మెచ్యూరిటిగా ఆలోచిస్తారని, గొడవలు రాకుండా చూసుకుంటారని వెంటనే సర్దుకుపోతారు అని వివాహబంధం తెగిపోకుండా జాగ్రత్త పడతారట.

అలాగే పది సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉన్న దంపతులు మధ్య ఎప్పుడు భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. వీళ్ళు ఏజ్ గ్యాప్ వల్ల సర్దుకుపో లేరు. అలాగే 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకుంటే వారి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చి వారి అభిరుచులు కలవక సంసార జీవితం చెడిపోతుందని అంటుంటారు. కాబట్టి వివాహం చేసుకునే వారిలో వయస్సు అనేది చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker