Health

మగవాళ్ళు తమ భార్యలకు కూడా చెప్పకుండా దాచే విషయాలు ఇవే.

భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్దా సంభాషించకూడదు. భార్యాభర్త దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు. కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు. దాని కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్త వసీకరణకు లొంగరు.

కొందరు ఆగ్రహంతో, గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలుగదట. అయితే మగ వాళ్లకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయాన్ని ఆడవాళ్లు గుర్తించాలి.. అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరు..వారిలో కూడా చాలా లోతు ఉంటుంది. వారి వ్యక్తిత్వంలో, వ్యక్తిగత జీవితంలో చాలా పొరలు ఉంటాయి. దాని కింద భావోద్వేగాలు, కోరికలను అణిచిపెట్టి ఉంటారు. పురుషులు కూడా రహస్యాలను దాచిపెట్టగలరని చాలా మంది లేడీస్‌కు తెలియదు.

ఎమోషనల్ సపోర్ట్ కావాలని మహిళలు అడిగినట్లుగా పురుషులు అడగరు, అడగలేరు. కానీ వారికి ఆ అవసరం ఉంటుంది. తమను ఎవరైనా ప్రేమించాలని, చెడు సమయాల్లో, కష్ట సమయాల్లో వారికి మద్దతు ఇవ్వాలని, ఒత్తిడి నుండి బయటపడటానికి సహాయం చేయాలని వారు కూడా కోరుకుంటారు. కానీ నోరు తెరిచి అడగలేరు. జీవిత భాగస్వామికి కూడా ఈ విషయం చెప్పరు.

భయాన్ని, బాధను బలహీనతగా అనుకోవడం వల్ల చాలా మంది పురుషులు వాటిని బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇష్టపడరు. భయం గురించి చెప్పినా, బాధ పడుతున్నామని ఎవరికైనా తెలిస్తే చులకన అయిపోతామని, హేలన చేస్తారన్న భయం వారిని భావోద్వేగాల గురించి చెప్పకుండా అడ్డుకుంటుంది. ఎవరైనా దగ్గరి వ్యక్తులు, సన్నిహితులు, ప్రియమైన వారు, కుటుంబసభ్యులను కోల్పోతే ఆ బాధను కూడా దిగమింగుకుంటారు.. కానీ బాధను పైకి చెప్పరు.. ముఖ్యంగా ఏడవరు.

ఆడవాళ్లు లాగా చిన్న విషయాలను పట్టించుకోరు.. బంధువుల మధ్య జరిగిన చిన్న సమస్యలను కూడా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వాటిని చాలా లైట్‌గా తీసుకుంటారు. అయితే ఈ వైఖరి కొన్నిసార్లు వారి సంబంధాన్ని సంతోషంగా ఉంచుతుంది. మరి కొన్నిసార్లు ఈ అజాగ్రత్తే పెద్ద గొడవలకు కారణం అవుతుంది.అందుకే మగవాళ్ళు కొన్ని చెప్పరు..చాలా క్లోజ్ అయితే తప్ప..ఏది ఏమైనా మగవాళ్ళు కఠినమైన వాళ్ళే..

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker