కరోనా నుంచి కోలుకున్న ప్రతి 8 మందిలో ఈ సమస్యతో బాధపడుతున్నారు.
దీర్ఘకాలిక కోవిడ్‌లో కోవిడ్ సోకిన తరువాత కూడా లక్షణాలు కన్పిస్తాయి. లేదా నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంటాయి. కరోనా వైరస్ నుంచి రికవర్ అయిన తరువాత ఒకవేళ పిల్లల్లో 4 వారాల తరువాత కూడా ఎనర్జీ లేకపోతే..ఆకలి వేయకపోతే..బరువు పెరగకపోతే..తలనొప్పి, బ్రెయిన్ ఫాగ్ కొనసాగుతుంటే వీటిని దీర్ఘకాలిక కోవిడ్‌గా చెప్పవచ్చు. అయితే కరోనా లక్షణాల్లో ఒకటి అలసట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
దీన్నే లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. కోవిడ్ సోకిన ప్రతి 8 మందిలో ఒకరికి ఈ వైరస్ నుంచి కోలుకున్న చాలా నెలల తర్వాత కూడా శరీరంలో లాంగ్ కోవిడ్ కనీసం ఒక లక్షణం ఉందని ఇటీవలి అధ్యయనం తేలింది. మార్చి 2020 నుంచి ఆగస్టు 2021 మధ్య నెదర్లాండ్స్‌లో 76,400 కంటే ఎక్కువ మందిపై అధ్యయనం చేశారు. ఈ వ్యక్తులు 23 సాధారణ కోవిడ్ లక్షణాలపై ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహించారు. వీరిలో 4,200 మందికి పైగా అంటే 5.5 శాతం మంది కోవిడ్ బారిన పడినట్లు గుర్తించారు.
వీరిలో, 21 శాతం మందికి పైగా కోవిడ్ సోకిన మూడు నుంచి ఐదు నెలల తర్వాత కూడా కనీసం ఒక కొత్త లక్షణాన్ని కలిగి ఉన్నారు. కోవిడ్ ఉన్నవారిలో 12.7 శాతం మంది.. అంటే ఎనిమిది మందిలో ఒకరికి కోవిడ్ ఒక లక్షణం ఉంది. కోవిడ్‌తో బాధపడుతున్న వారిలో దాదాపు 12.7 శాతం మంది దీర్ఘకాలిక లక్షణాలను ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనం చెబుతోంది.
పరిశోధనలో, కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు ముందు.. ఆ తర్వాత లక్షణాలు పర్యవేక్షించబడ్డాయి. దీర్ఘకాలికంగా సోకిన రోగులలో ఏ విధమైన శాశ్వత లక్షణాలు అభివృద్ధి చెందుతున్నాయో తెలుసుకోవడానికి పరిశోధకులకు ఇది సహాయపడింది. ఈ సమస్యలు అధికం…ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల నొప్పి, రుచి, వాసన కోల్పోవడం.. వంటి సాధారణ అలసటతో సహా చాలా కాలంగా వ్యాధి సోకిన రోగులలో ఈ లక్షణాలు చాలా కనిపిస్తాయని పరిశోధకులు తెలిపారు.