Health

cucumber: రోజు రెండు ముక్కలు వీటిని తింటే చాలు, మీ శరీరానికి పవర్‌ఫుల్ దివ్యౌషధంలా పనిచేస్తుంది.

cucumber: రోజు రెండు ముక్కలు వీటిని తింటే చాలు, మీ శరీరానికి పవర్‌ఫుల్ దివ్యౌషధంలా పనిచేస్తుంది.

cucumber: కీరదోస ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. దీనిలో ఉన్న కూలింగ్ ఫ్యాక్టర్స్.. శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే కీరదోసకాయలో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C, విటమిన్ K, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. కీరలోని పోషకాలు కణజాలాలను బలోపేతం చేసేందుకు దోహదపడతాయి. మనం సాధారణంగా కీరదోసకాయను సలాడ్ రూపంలో తింటాము.

Also Read: శరీరంలోఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?

ముఖ్యంగా వేసవిలో దాని డిమాండ్ పెరుగుతుంది.. ఎందుకంటే ఇది మన శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: కీరదోసకాయ మన కడుపులోని వేడిని తగ్గించేందుకు సహాయపడుతుంది.. అలాగే కడుపును చల్లగా ఉంచేలా చేస్తుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, ఇందులో నీరు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.. ఇంకా ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది.

చర్మానికి మేలు చేస్తుంది: కీరదోసకాయలు మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అందుకే దీనిని అనేక ఫేస్ ప్యాక్‌లు, సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. కీరదోసకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.. కాబట్టి మనం దీనిని తింటే చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది: హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించేందుకు, నివారించడానికి కీరదోసకాయలు తప్పనిసరిగా తినాలి. ఈ కూరగాయలలో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు సమస్య ఉండదు.

Also Read: రోజు ఉదయాన్నే ఒక ఒకే ఒక్క వెల్లుల్లిరెబ్బ తింటే చాలు.

గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గుతుంది: చలికాలంలో కీరదోసను రెగ్యులర్‌గా తింటే క్రమంగా బరువు తగ్గుతారు.. వాస్తవానికి చలి వల్ల చాలామంది ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు.. దీని కారణంగా శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఈ కాలంలో ఆయిల్ ఫుడ్ కు బదులు దోసకాయ తింటే.. క్యాలరీలు తీసుకోవడం తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎముకలకు మంచిది: రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, ఎముకలు పటుత్వాన్ని కోల్పోకుండా కాపాడటంలోనూ కీరదోసకాయలు సహాయపడుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker