రోజుకి ఒక చిక్కీ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
వేరు శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం లో పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటివి ఉంటాయి, ఇవి మెటబాలిజం ని బూస్ట్ చేస్తాయి. మొలాసెస్ లో, వేరు శనగల్లో ఉండే కాల్షియం ఎముకలు బలం గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అయితే, వీటిని మితంగానే తీసుకోవాలని గుర్తు పెట్టుకోండి. డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎన్ని పోషకాలను అందిస్తాయో, ఎంత బలమో అందరికీ తెలిసిన విషయమే.
కానీ పిల్లలు కొన్ని రకాల నట్స్ తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా చిక్కీ చేసి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి తియ్యగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు కాబట్టి, పెద్ద కష్టపడక్కర్లేదు కూడా. చలికాలంలో డ్రైఫ్రూట్స్ తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కాలంలోనే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆ శక్తి పెరుగుతుంది.
ఈ సీజన్లో వచ్చే ఎన్నో అనారోగ్యాలకు ఇవి చెక్ పెడతాయి. ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ అధికంగా ఉంటాయి. శరీరంలో రక్తప్రసరణను, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. మహిళలు వీటిని తినడం చాలా ముఖ్యం. వీరిలోనే రక్తహీనత అధికంగా కనిపిస్తుంది. అందుకే పిల్లలు, మహిళలు తినాల్సిన అవసరం ఉంది. డ్రైఫ్రూట్స్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరస్తుంది. అజీర్తిని రాకుండా అడ్డుకుంటుంది.
వీటిని రోజూ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. వీటిలో ఉండే కొవ్వులు, ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జుట్టు పెరుగుదలకు ఇవి చాలా అవసరం. జుట్టు ఊడిపోవడం, బలహీనంగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వీటిని తినడం వల్ల మేలు జరుగుతుంది. వీటిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఫ్రీరాడికల్స్ తో పోరడతాయి.