Health

రోజు చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

రోజురోజుకూ వైద్యం ఖరీదుగా మారుతున్నప్పుడు పైసా ఖర్చు లేకుండా చప్పట్లు కొట్టే అలవాటు అలవర్చుకుంటే పలు అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.ఉదయం రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత 5 నిమిషాలు చప్పట్లు కొట్టడం అలవాటుగా పెట్టుకోండి. ఆ తర్వాత 5 నిమిషాలు పడుకుని, అవయవాలను రిలాక్స్ చేసి, శవాసనం చేయాలి. అయితే రెండు చేతులను మీ భుజాలకు ఎదురుగా పైకి లేపండి.

చేతులను వీలైనంత వెడల్పుగా చాచి చప్పట్లు కట్టాలి. ఒక నిమిషం పాటు నెమ్మదిగా చప్పట్లు కొట్టండి. కాస్త అలసటగా అనిపిస్తే, మీ చేతులకు ఒకటిన్నర నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మరో నిమిషం పాటు చప్పట్లు కొట్టండి. ఇలా 4-5 సార్లు చేయండి. ఒక వారంలో మీరు దానికి అలవాటు పడతారు. అలా నిమిషానికి సుమారు 50 నుండి 100 క్లాప్స్ కొట్టవచ్చు. అంటే 5 నిమిషాల్లో 300 నుండి 500 సార్లు చప్పట్లు కొట్టవచ్చనమాట..

ఇంతకీ ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేగా మీ డౌట్.. ఉదయం రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత 5 నిమిషాలు చప్పట్లు కొట్టడం అలవాటుగా పెట్టుకోండి. శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.. కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరం యాక్టివ్‌గా మారుతుంది. చప్పట్లు కొట్టడంలో ఆక్యుప్రెషర్ సూత్రం దాగి ఉంది.

ఇందులో రెండు అరచేతులపై ఉన్న వేల పాయింట్లపై చప్పట్లు కొట్టడం వల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ సాఫీగా జరగడమే ఆరోగ్య ప్రయోజనాలకు కారణమని వైద్యులు అంటున్నారు. రోజూ చప్పట్లు కొట్టడం ద్వారా పొట్ట సమస్య, మెడ, నడుము నొప్పి, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చచ.. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ వ్యాయామంలో చప్పట్లు కొడితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. సో..అప్పుడప్పుడు చేసేయండి మరీ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker