ప్రతి రోజు టీ తాగే అలవాటు ఉందా..? వైద్యులు ఏం చెప్పారంటే..?
ఎక్కువ శాతం మంది వారి యొక్క రోజుని టీ తో మొదలు పెడుతుంటారు. పైగా రోజు లో ఒకటి కాదు రెండు కాదు మూడు నుండి నాలుగు కప్పుల వరకు తాగేస్తుంటారు. నిజానికి ఇలా ఎక్కువగా టీ తాగడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి టీ గుట్క గొంతులోకి దిగందే చాలా మందికి తెల్లారినట్లు ఉండదు. మన ఇంటికి ఎవరైనా అతిథులు రాగానే ఛాయ్ ఆఫర్ చేస్తుంటాం.
అలాగే, స్నేహితులు కలిసినప్పుడు కూడా టీ తీసుకుంటూ టైంపాస్ చేస్తుంటాం. అయితే, నిత్యం టీ తాగడం మన ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత మేరకు ఛాయ్ తాగాలి? ఎక్కువ ఛాయ్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే సందేహాలు మనల్ని తొలిచేస్తుంటాయి. తొలుత ఛాయ్‌ను చైనాలో వైద్యచికిత్సలో భాగంగా తాగే వారు. కాగా, ఇది వ్యసనంగా తయారై ఆరోగ్య సమస్యలు తెచ్చేలా మారింది. మన వద్ద ఛాయ్‌ని పాలతో కలిపి తయారు చేస్తారు.
పాలు, కెఫిన్ కలవటం వల్ల కడుపులో గ్యాస్ తయారవుతుంది. అందుకని ఎక్కువ టీ తాగేవాళ్ళకి అజీర్ణ సమస్యలు ఎదురవుతాయి. కెఫిన్ డ్రింక్ రోజు తాగటం వల్ల అదొక అలవాటుగా మారుతుంది. కొందరు రోజులో 4-5 కప్పుల ఛాయ్ తాగుతుంటారు. ఇలా తాగటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భంతో ఉన్నవారు ఛాయ్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త గా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. టీ తాగినప్పుడు మన మెదడు చురుకుగా పనిచేస్తుంది.
కొన్ని రకాల కాన్సర్లు రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే, గుండె పోటు రాకుండా రక్షిస్తుంది. ప్రతి రోజు రెండు కప్పుల కంటే ఎక్కువ కప్పులు తాగే వారి మరణాల ప్రమాదం 9 నుండి 13 శాతం తక్కువగా ఉన్నదని ఓ అధ్యయనంలో తేలింది. రోజుకు రెండు కప్పుల టీ మాత్రమే తీసుకుంటే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. గ్రీన్ టీ తాగేవారిలో శరీరం బరువు తగ్గుతుంది. ఇక బ్లాక్ టీ తాగడం మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.