రోజు ఒక ముక్క క్యారెట్ తింటే ఎన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చో తెలుసుకోండి.

క్యారెట్ ని ఉపయోగించి కూర, క్యారెట్ రైస్, క్యారెట్ ఫ్రై కూడా చేసుకుంటాము. క్యారెట్ రంగే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ లో విటమిన్ A, B1,B2, B3, B6, C మరియు బీటా కెరోటిన్, కాల్షియమ్, పొటాషియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్లలో పొటాషియం, విటమిన్ ఎ, బయోటిన్, విటమిన్ బి 6 వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
అయితే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే క్యారెట్ ను రోజూ తింటే వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బీటా కెరోటిన్లు, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన క్యారెట్లను తింటే బరువు తగ్గడంతో పాటుగా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కళ్లు బాగా కనిపిస్తాయి. అంతేకాదు క్యారెట్లు క్యాన్సర్ నివారణగా కూడా పనిచేస్తాయి.
క్యారెట్లలో ఫాల్కారినాల్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఫాల్కారినాల్ కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని రక్షిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు క్యారెట్లు శరీర బలాన్ని పెంచడానికి, వ్యాధిని నివారించడానికి కూడా సహాయపడతాయి. Utrecht లోని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. క్యారెట్లు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 60% వరకు తగ్గించడానికి సహాయపడతాయని తేలింది.
క్యారెట్ జ్యూస్ ను లివర్ క్యాన్సర్ లేదా లివర్ సిర్రోసిస్ నివారణగా కూడా ఉపయోగిస్తారు. దీని గొప్ప పోషక లక్షణాలు కాలేయ ఎంజైమ్లను మరమ్మత్తు చేయడానికి, పునరుత్పత్తి చేయడానికి సహాయపడతాయి. మీ రోజు వారి ఆహారంలో క్యారెట్లను చేర్చడం వల్ల మీ జుట్టును బలోపేతం అవుతుంది. అలాగే మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుతుంది. క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
వీటిలోని పొటాషియం కంటెంట్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే దీనిలోని విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కేలరీలు తక్కువగా, ఫైబర్ కు మంచి మూలమైన క్యారెట్లు వంటి కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లను అలాగే తినడం వల్ల దీనిలోని ఫైబర్, అధిక ఆర్ద్రీకరణ ఆకలిని నియంత్రించడానికి సహాయపడతాయి.