రోజుకు నాలుగు ఎండు ద్రాక్షలు తింటే చాలు, జీవితంలో ఆ సమస్యలు రావు.
నల్ల ఎండు ద్రాక్ష (కిస్ మిస్)లో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కండరాలు, ఎముకలు, కార్టిలేజ్ (మృదులాస్థి) ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ తగినంత అవసరం. అలాగే, పీహెచ్ స్థాయి ఆరోగ్యకరంగా ఉండేలా చూస్తుంది. వ్యాధి నిరోధక శక్తికి కీలకంగా పనిచేస్తుంది. శరీరంలో నీటి సమతుల్యతకు కూడా ప్రొటీన్ అవసరం. అయితే ఎండు ద్రాక్షలోనే పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
అందుకే రోజుకు ఒక 5 లేదంటే 6 ఎండు ద్రాక్షలను తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎండు ద్రాక్ష ఉపయోగాలు.. ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కావున ఎండు ద్రాక్ష తింటే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి..ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు, 10 ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎండు ద్రాక్ష ఎలా తినాలంటే..ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం వలన నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.అందుకే ప్రతి రోజూ ఓ కప్పు నీటిలో 10 నుంచి 15 ఎండు ద్రాక్షలను నానబెట్టి వాటిలో కొద్దిగా నిమ్మరసం కలపి మళ్ళీ ఒక నాలుగు లేదంటే ఐదు గంటల పాటు నానపెట్టి ఆ తర్వాత ఎండు ద్రాక్షను నమలి తినాలి..ఇలా క్రమం తప్పకుండా చేస్తే రక్తహీనత తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుదల.. అలాగే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి ఎండు ఎండుద్రాక్ష తప్పకుండా ఇవ్వండి.
ఎందుకంటే ఎండు ద్రాక్ష తినడం వలన శరీరంలో సహజంగా వేడి పుడుతుంది. దీనివల్ల పిల్లలు రాత్రిపూట పక్కలో మూత్రవిసర్జన చేయరు.అలాగే ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే బీపీ ఉన్నవారికి నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే రక్తపోటు తగ్గుతుంది. ఎండుద్రాక్షను పాలతో కలిపి తీసుకుంటే పురుషుల్లో సంతానోత్పత్తి మెరుగుపడడంతో పాటుగా లైంగిక శక్తిని కూడా పెంచడంలో సహాయపడుతుంది.