ఈ గింజలను తరచూ తింటే మీ వీర్యకణాల సంఖ్య రెట్టింపు అవుతుంది.
వాల్నట్స్లో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని రోజంతా యాక్టివ్గా ఉంచేందుకు సహకరిస్తాయి. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎంత ఎక్కువ సేపు పనిచేసినా అలసిపోరు. అయితే నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, రాగి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వీర్యకణాల సంఖ్యను పెంచడానికి ఎంతో సహాయపడతాయి.
జీడిపప్పులో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని రోజూ గుప్పెడు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ గింజలు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే జీడిపప్పులు రక్త నాళాలను బలోపేతం చేస్తాయి. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. జీడిప్పప్పులు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే రక్తపోటును మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
వేరుశెనగ, జీడిపప్పుల్లో ఫైబర్ కంటెంట్ తో పాటుగా, పాలీ అన్శాచురేటెడ్ కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. అలాగే డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. జీడిపప్పులో ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు, పొటాషియం, మెగ్నీషియం, అర్జినిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. జీడిపప్పులో షుగర్ లెవెల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
అందుకే షుగర్ పేషెంట్లు వీటిని రోజుకు 3 నుంచి 4 మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా రకరకాల విటమిన్లు, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీర మంటను తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఈ పప్పులు ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. బిఎంసి మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గింజల్లో పుష్కలంగా ఉంటే ఫైబర్ కంటెంట్ మీరు సులువుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. జీడిపప్పును తినడం వల్ల శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
అలాగే డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండేవారు జీడిపప్పులను తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పులో జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పురుషులలో స్పెర్మ్ కౌంట్ ను బాగా పెంచుతుంది. ఇది సంతానోత్పత్తి సమస్యలను పోగొట్టడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది స్పెర్మ్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఇకపోతే క్రమం తప్పకుండా జీడిపప్పులను తినడం వల్ల బరువు, మధుమేహం నియంత్రణలో ఉంటాయి.