రోజుకు శనగలు గుప్పెడు తింటే చాలు, డయాబెటిస్ నుండి బయటపడొచ్చు.
మన అందరి ఇళ్లలో ఎప్పుడూ నిలువ ఉండే శనగలు ఓ కప్పు తింటే బోలెడంత శక్తి కూడా వస్తుంది. శాకాహారులకు ఇది మంచి ప్రత్యామ్నాయం. లెగ్యూమ్ జాతికి చెందిన శనగల్లో నాటీ శెనగలు, కాబూలీ వాలా శెనగలు వంటివి లభిస్తాయి. అయితే శనగలు పోషకాల నిలయం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటారు. నైవేద్యంగా కూడా శనగలు పెడతారు. ఇవి అధికబరువును తగ్గించడమే కాదు, ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
మాంసాహారం తినలేనివారికి శనగలు అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. శనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు, కొవ్వు, కార్బొహైడ్రేట్లు సహా మాంగనీస్, కాపర్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. రోజుకు గుప్పెడు శనగలు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయని పోషకాహర నిపుణులు సూచిస్తున్నారు. కప్పు శనగల్లో 26 శాతం ఇనుము ఉంటుంది. ఎర్రరక్త కణాల ఉత్పత్తిలో ఇనుము ప్రాధాన్యత ఎక్కువ. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
మహిళల్లో ఎక్కువగా కనిపించే ఇనుములోపం సమస్యను శనగలను తీసుకోవడం ద్వారా దూరమౌతుంది. కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. వీటిలో పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెంపులో తోడ్పడటమే కాకుండా, అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. శనగల్లో పుష్కలంగా ప్రొటీన్లుండటంతో శాకాహారులకు ఇవి పోషకాహారం. వీటిలోని సి విటమిన్ శరీరం ఇనుమును పీల్చుకునేలా దోహదపడుతుంది. వీటిలోని పీచు, ప్రొటీన్లు రక్తంలో గ్లూకోజు స్థాయులను సమన్వయం చేస్తాయి.
టైప్2 డయాబెటిస్‌ను దరిచేరకుండా పరిరక్షిస్తాయి. శనగలు శరీరంలో అధిక కెలోరీలను తగ్గిస్తాయి. రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకున్న వారు అధిక బరువు సమస్య నుంచి బయటపడినట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. ప్రొటీన్లు, పీచు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువు సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.