రోజు ఐదు నిమిషాల ఇలా చేస్తే అకాల మరణ ప్రమాదం నుంచి రక్షణ పొందుతారు.
వ్యాయామం సంపూర్ణ ఆరోగ్యానికి చాల అవసరం. మన శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా చేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును. యూకే బయోబ్యాంక్ అధ్యయనంలో 25,241 మందిపై పరిశోధనలు జరిపారు. 56 శాతం మంది మహిళలు, మిగతావారు పురుషులు. సగటు వయస్సు 62 సంవత్సరాల వారిపై పరిశోధనలు జరిపారు.
వీరిలో చాలా మంది వారానికి ఒకసారి కంటే ఎక్కువ శారీరక వ్యాయామాలు చేయడం, నడవడం కూడా చేయడం లేదని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో వారి దిన చర్యను తెలుసుకునేందుకు వారికి ఫిట్‌నెస్ ట్రాకర్ సదుపాయం ఉన్న స్మార్ట్ వాచ్‌లను కూడా అందించారు. ఒక వారం పాటు వారి కార్యకాలాపాలను పరిశీలించారు. వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు.. ఈ అధ్యయనం దాదాపు ఏడేళ్లపాటు నిర్వహించారు. అధ్యయనం ప్రారంభంలో సేకరించిన డేటాను, ఆ తరువాత వారి క్లినికల్ రికార్డులతో కలిపి పరిశీలించారు.
ఎవరైనా మరణించారా? ఒకవేళ చనిపోతే వారి మరణానికి గల కారణం ఏంటి? అని వివరాలు చెక్ చేశారు. అదే సమయంలో వ్యక్తి తీసుకునే ఆహారం, ధూమపానం, మద్యం వంటి అలవాట్లు, ఇతర వివరాలన్నీ పరిశీలించారు. అలాగే, ఇప్పటికే క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్న వారిని, మొదటి రెండేళ్లలో మరణించిన వారిని ఈ పరిశోధన నుంచి మినహాయించారు. ఒక నిమిషం కంటే తక్కువ శారరీక శ్రమ.. అయితే, 89 శాతం మంది వ్యక్తులు ట్రాకర్ ఎలాంటి సాధారణ వ్యాయామాలు చేయనప్పటికీ.. ట్రాకర్‌లో మాత్రం వారు అడపాదడపా శారీకక వ్యాయామాలు చేస్తున్నట్లు నమోదైంది. ఇది సాధారణంగా ఒక నిమిషం కంటే తక్కువ సమయం పాటు ఉండే శారీరక శ్రమ.
రోజువారీ జీవితంలో ఒక భాగం. ఈ రకమైన శ్రమకు కొన్ని ఉదాహరణకు పిల్లలు, పెంపుడు జంతువులతో ఆడుకోవడం, షాపింగ్ చేయడం, ఎత్తుపైకి వేగంగా నడవడం, రైలు, బస్సును అందుకోవడానికి పరుగెత్తడం, వంటివి కూడా శారీరక వ్యాయామాలుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. రోజువారీగా చూసుకుంటే.. సగటున నాలుగు నిమిషాల పాటు వీరు శారీరక వ్యాయామం చేశారు. ప్రతిరోజూ కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాలపాటు మితమైన వ్యాయామం చేయడం వల్ల అకాల మరణ అవకాశం దాదాపు 40 శాతం తగ్గిందని పరిశోధకులు తెలిపారు.
అంతేకాదు.. గుండె జబ్బుల కారణంగా మరణించే ప్రమాదాన్ని 49 శాతం తగ్గిస్తుందన్నారు. ఇతర పరిశోధనలతోనూ ఈ ఫలితాలు సరిపోలాయని, అడపాదడపా వ్యాయామాలు కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలిందన్నారు. ఇది దీర్ఘాయుకు కీలకం అన్నారు. అధిక శారీక శ్రమ..ఇక ఎక్కువ వ్యాయామాలు, అధికా శారీరక శ్రమ చేసే వారి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండటం, కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం నింత్రణలో ఉంటుంది. దీంతోపాటు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం కూడా భారీగా తగ్గింది.