రోజు నిమ్మకాయ నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
చిన్న, పెద్ద తేడా లేకుండా నిమ్మకాయ నీళ్లు తీసుకోవచ్చు. అంతేకాకుండా.. వేసవిలో నిమ్మకాయ నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే నిమ్మకాయ నీళ్లు బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే అధిక బరువుకు చెక్ పెట్టేందుకు చాలామంది నిమ్మకాయ నీళ్లను సేవిస్తుంటారు. వేసవిలో ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూడా లెమన్ వాటర్ తాగుతుంటారు. అంతకుమించి చాలామందికి తెలియదు. కానీ నిమ్మరసంతో చాలా ప్రయోజనాలున్నాయి.
పటిష్టమైన, ఆరోగ్యమైన దేహం కోసం నిమ్మరసం లేదా లెమన్ వాటర్ తప్పకుండా తీసుకోవాలి. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. చెమట ద్వారా శరీరం నుంచి బయటకు పోయే పోషకాల్ని లెమన్ వాటర్ భర్తీ చేస్తుంది. నిమ్మరసంలో కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక నిమ్మకాయలో 10 శాతం కార్బోహైడ్రేట్స్, 88-89 శాతం నీళ్లు ఉంటాయి. 100 గ్రాముల నిమ్మకాయలో 29 కేలరీలు, 1.1 గ్రామ్ ప్రోటీన్, 9.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.5 గ్రాముల పంచదార, 2.8 గ్రాముల ఫైబర్ ఉంటాయి. మరోవైపు నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అనేది అతి ముఖ్యమైన విటమిన్, యాంటీ ఆక్సిడెంట్. ఇమ్యూనిటీని పెంచుతుంది.
నిమ్మకాయలో పొటాషియం కూడా తగిన మోతాదులో ఉంటుంది. బ్లడ్ షుగర్ నియంత్రణకు దోహదపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి6 తినే ఆహారాన్ని ఎనర్జీగా మార్చడంలో దోహదపడుతుంది. నిమ్మకాయలో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటు కల్గించే ముప్పును తగ్గిస్తుంది. నిమ్మకాయలో ఆరెంజ్, ద్రాక్షలానే ప్రోటీన్లు తగిన మోతాదులో ఉంటాయి. నిమ్మకాయను డైట్‌లో భాగంగా చేసుకుంటే చాలా లాభాలున్నాయి. నిమ్మకాయ నీటిలో ఉండే విటమిన్ సితో యాంటీ ఏజీయింగ్ గుణాలు వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి.
శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు నిమ్మకాయ నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఎండలోంచి వచ్చినప్పుడు నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల ఫ్రెష్‌నెస్ వస్తుంది. ఆటల సమయంలో నిర్ణీత మోతాదులో నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల క్రాంప్స్ దూరమౌతాయి. వ్యాయామం చేసేటప్పుడు అలసట దూరం చేసేందుకు మద్య మధ్యలో నిమ్మకాయ నీళ్లు తాగడం మంచిది. నిమ్మకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల స్వెల్లింగ్, పెయిన్స్ దూరమౌతాయి. నిర్ణీత మోతాదులో నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.