Health

రోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే ఈ రోగాలు మిమ్మల్ని ఏం చేయలేవు.

శనగల్లో పీచు పదార్ధం సమృద్ధిగా ఉండుట వలన చెడు కొలస్ట్రాల్ ని తొలగించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. శనగల్లో మాంసంలో ఉండే ప్రోటీన్స్ అన్ని ఉంటాయి. అందువల్ల నాన్‌వెజ్ తిన‌లేని వారికి శ‌న‌గ‌లు ఒక వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.ప్రతి రోజు ఒక కప్పు ఉడికించిన శనగలను తింటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. శనగల్లో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండుట వలన హైబీపీని కంట్రోల్ చేస్తాయి.

అయితే శనగల్లో నాటు శనగలు, కాబూలీ శనగలు, ఆకుపచ్చ రంగులో ఉండే శనగలు కూడా ఉంటాయి. శనగలతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మాంసంలో ఉన్న పోషకాలన్నీ శనగలలో కూడా పుష్కలంగా ఉంటాయని, అందుకే వీటిని పేదోడి బాదం అని కూడా అంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక కొన్ని శనగలను నానబెట్టి మొలకలు వచ్చాక పచ్చివి తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరం. శనగల చాట్‌ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

శనగల్లో క్యాల్షియం, విటమిన్‌ ఏ, బీ, సీ, ఈ, కే, ఫాలేట్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సెలీనియం, ఫైబర్‌, ఐరన్‌ వంటి అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయి శనగలు. క్యాల్షియం లోపంతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారమని అంటున్నారు నిపుణులు. శనగలను ఆహారంలో తీసుకోవడం వలన ఐరన్‌, ప్రోటీన్‌, మినరల్స్‌ శరీరానికి శక్తిని అందిస్తాయి. దీంతో అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి శరీరం దరికి చేరవు. శనగల్లో పీచు సమృద్ధిగా ఉండడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మలబద్ధకం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. శనగలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తాయి. దీనివల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉండడమే కాక అధిక బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. శనగలు శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేసి ఆస్టియోపోరోసిస్‌, అనీమియాతో బాధపడుతున్నవారికి పౌష్టికాహారంగా ఉపయోగపడతాయి. మధుమేహంలో బాధపడేవారు రోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

శనగల్లో ఉండే అమైనోయాసిడ్స్‌ రక్తకణాల వృద్ధికి, రక్త సరఫారకు దోహదపడతాయి. అలాగే రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. నిద్రలేమి సమస్యలు ఉన్నవారు వీటిని నిత్యం తినడం చాలా ఉపయోగకరం. శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది. శనగల్లోని ఆల్ఫా లినోలెనిక్‌ యాసిడ్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. అలాగే శనగల్లో ఉండే విటమిన్‌ బీ9 లేదా ఫోలేట్‌.. మెదడు, కండరాల అభివద్ధికి దోహదపడతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker