Health

రోజంతా నీరసంగా ఉంటోందా..? వెంటనే ఈ పని చెయ్యండి చాలు.

ప్రస్తుత రోజుల్లో మనం తినే ఆహారంలో బలం ఉండటం లేదు. పాతతరం అంటే ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం, ఇప్పటి తరం ఆరోగ్యం పోల్చితే..పాతతరం వారిలోనే బలమెక్కువగా కన్పిస్తుంది. దీనికి ప్రధాన కారణం అప్పటి ఆహారానికి ఇప్పటి ఆహారానికి తేడా ఉండటమే. అందుకే తరచూ అనారోగ్యం, తీవ్రమైన అలసట, రోగ నిరోధక శక్తి లోపించడం వంటివి కన్పిస్తున్నాయి. అయితే చాలా మందికి బలహీనంగా నీరసంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అటువంటప్పుడు వాళ్లలో స్టామినాని పెంచుకోవాలి అనుకుంటూ ఉంటారు.

మీకు కూడా తరచూ నీరసంగా బలహీనంగా అనిపిస్తూ ఉంటుందా..? అయితే కచ్చితంగా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది పైగా సామర్థ్యం పెరుగుతుంది. ఇంట్లో పనులు ఆఫీసు పనులు ఇలా చాలా ఉంటూ ఉంటాయి. అటువంటప్పుడు మనం మంచి ఆహార పదార్థాలను డైట్ లో తీసుకుంటూ ఉండాలి ఇటువంటి ఆహార పదార్థాలను కనుక తింటే సామర్థ్యం పెరుగుతుంది నీరసం తగ్గుతుంది.

బీన్స్.. బీన్స్ లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫాలిక్ యాసిడ్ మొదలైన పోషక పదార్థాలు బీన్స్ లో ఉంటాయి బలహీనంగా నీరసంగా అనిపిస్తుంటే బీన్స్ తీసుకుంటూ ఉండండి. బ్రౌన్ రైస్.. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. నెమ్మదిగా ఎనర్జీని బ్లడ్ లోకి పంపిస్తుంది. రోజంతా కూడా మీరు ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

గుడ్లు.. గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు..ఆకుకూరల్లో కూడా పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి వీటిని తీసుకుంటే కూడా మనకి సామర్థ్యం పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. కాఫీ..కాఫీ ఇన్స్టెంట్ గా ఎనర్జీ ని పెంచుతుంది కాఫీ తాగడం వల్ల బ్రెయిన్ లోకి ఎనర్జీ వెళ్తుంది. ఒక కప్పు కాఫీ సెంట్రల్ నెర్వస్ సిస్టం పై కూడా ప్రభావం చూపిస్తుంది. నీరసాన్ని కూడా ఈజీగా తగ్గించేస్తుంది. అలానే చిలకడదుంపలు, డార్క్ చాక్లెట్ కూడా సామర్థ్యాన్ని పెంచుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker