Health

ఈ ఇంటి చిట్కాలతో కళ్ల కింద నల్ల చారలు వెంటనే తొలిగిపోతాయి.

కళ్ల కింద నల్ల చారలు అందరికీ రావు. సరిగా నిద్రపోకపోయినా… ఎండలో ఎక్కువగా తిరిగినా… అదే పనిగా మొబైల్ లేదా కంప్యూటర్ల ముందు ఉన్నా… బాగా అలసిపోతే క్రమంగా కళ్ల కింద నల్ల చారలు రావడం మొదలవుతుంది. ఒత్తిడి, టెన్షన్లు, డిప్రెషన్ వల్ల కూడా ఇవి వస్తాయి. అయితే ఒక్కొక్కరి చర్మం తీరునుబట్టి వారిలో ఈ చారలు కనిపిస్తాయి. ఇంతకీ ఈ నల్లటి చారలను ఎలా దూరం చేయాలి? వచ్చిన వాటిని ఎలా తగ్గించుకోవాలా? అని తెగ హైరానా పడుతుంటారు. అసలు ఈ నల్లటి చారలు ఎందుకు వస్తాయో తెలిస్తే.. నెమ్మదిగా వీటిని దూరం చేయవచ్చు.

వచ్చిన చారలను తగ్గించుకునేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. కళ్ల కింద చర్మం చాలా పలచగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎన్నోశోషరసగ్రంథులు లేదా సిరలు (నరాలు) ఉంటాయి. నల్లటి చారలు ఎక్కువగా.. ఫ్లూయిడ్ లోపం, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం కారణంగా వస్తాయి. కళ్ల కింది చర్మం కాంతివంతంగా కనిపించాలి. కాంతివంతమైన చర్మంపై కేశనాళికలను స్పష్టంగా చూడవచ్చు. ఒకవేళ కంటి కింది చర్మంపై ఏమైనా కొవ్వు వంటి సెల్స్ ఉంటే మొత్తానికే కనిపించవు. కంటి నిండా నిద్రలేకపోవడం, అనారోగ్యకరమైన డైట్ ద్వారా నల్లటి చారలపై ఎన్ని క్రీమ్స్ రాసినా ఫలితం ఉండదు అనే విషయాన్ని గుర్తించుకోవాలి.

కానీ, కంటి చర్మంపై క్రీములతో మెరుగైన ఫలితం తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. ప్రత్యేకమైన కంటి క్రీములను కంటి చుట్టూ రాయడం వల్ల మంచి ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది. క్రీమ్స్ లోని ఔషధ విలువలు చర్మాన్ని మరింత కాంతివంతగా కనిపించేలా చేస్తాయి. కంటికి అప్లయ్ చేసే క్రీమ్స్.. ప్రతిరోజు రెండూ పూటలా వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్రీమ్స్ లోని కేఫెన్ మిశ్రమం.. కంటి కింద చర్మంపై విటమిన్స్ A, C తో పాటు రక్తప్రసరణ కలిగేలా ఉత్తేజపరుస్తుంది. నల్లటి చారలకు ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో తొలి చిట్కా అంటే.. దోసకాయ మాస్క్ కళ్లకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కీరదోసకాయను సన్నగా కట్ చేసిన తర్వాత ఒక్కో ముక్కను మూసిన కళ్లపై పెట్టాలి.

కాసేపు రిలాక్స్ అవ్వండి. పచ్చి కూరగయాలు కూడా చల్లగానూ మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. వెంటనే కళ్లు ప్రెష్ గా కనిపిస్తాయి. పెరుగు వంటి పదార్థాలను పెట్టరాదు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. క్వార్క్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇది కూడా పెరుగు వంటి పదార్థమే అయినప్పటికీ మంచి ఉపశమనం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ క్వార్క్ ను ఒక్కో కంటిపై అప్లయ్ చేయండి. 10నిమిషాల పాటు ఉంచండి. కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తగా క్వార్క్ తొలగించండి. ఇంటి చిట్కాల్లో ఏది కూడా పనిచేయకపోతే మాత్రం కచ్చితంగా వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. నల్లటి చారలు వచ్చాయంటే.. మినరల్ లేదా ఐరన్ సాంద్రత తక్కువగా ఉన్నట్టు సంకేతం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker