News

హత్య కేసులో స్టార్ హీరో అరెస్ట్, జైలులో స్టార్ హీరో దుస్థితి తెలుసా..?

తన ప్రియురాలు పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై దర్శన్‌, పవిత్ర గౌడతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక దర్శన్‌తో సహా 13 మంది నిందితులు అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. అయితే ఈ జైలులో దర్శన్ పరిస్థితి దారుణంగా మారింది. అయితే స్టార్ హీరోగా సకల సౌకర్యాలు అనుభవించిన అతను ఇప్పుడు జైలులో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.

రేణుకా స్వామి హత్య కేసులో హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడతో సహా మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. మరోవైపు రేణుకా స్వామి హత్యపై కర్ణాటకలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దర్శన్‌తో సహా 13 మంది నిందితులు అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.

కాగా ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులతో పదే పదే చెబుతున్నాడట దర్శన్. పోలీస్ స్టేషన్ లో అసలు నిద్రపోవడం లేదట. పవిత్రతో సహా తోటి నిందితులు బిర్యానీ తిన్నా దర్శన్ మాత్రం ఖాళీ కడుపుతోనే ఉండిపోయాడట. పోలీస్ స్టేషన్‌లో దిగాలుగా ఉంటోన్న దర్శన్ కు పండ్ల జ్యూస్, ఇడ్లీలు ఇచ్చిన తినలేదట. అయితే తాగడానికి ఒక్క సిగరెట్ ఇవ్వాలని మాత్రం పోలీసులను వేడుకున్నడట ఈ స్టార్ హీరో.

‘ చేతులు వణుకుతున్నాయి.. ఒక్క సిగరెట్ ఇప్పించండి ప్లీజ్’ అని దర్శన్ పోలీసులను అభ్యర్థించాడట. అయతే పోలీసులు మాత్ర దర్శన్ కు సిగరెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా విచారణలో భాగంగా ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీలోనే ఉండనున్నాడీ హీరో. మరోవైపు దర్శన్ కు వ్యతిరేకంగా కన్నడ నాట ఆందోళనలు, ధర్నాలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అభిమానిని హత్య చేయించిన ఈ స్టార్ హీరోకు కఠిన శిక్ష పడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker