ఈ విషయాలు తెలిస్తే ఖర్జూర కల్లు తాగకుండా ఉండలేరు.

ప్రస్తుతం ఖర్జూర కల్లు ఓ రేంజ్‌లో అమ్ముడు పోతోంది. ఉదయం ఆరు గంటల నుంచి యాదయ్య పొలం వద్ద కల్లు ప్రియులు లైన్ కడుతున్నారు. మరికొంత మంది ముందుగానే ఆర్డర్లిచ్చి కల్లు తెప్పించుకుంటున్నారు. పదిహేనేళ్లుగా యాదయ్య పడ్డ కష్టానికి ఫలితం దక్కుతోంది. ఖర్జూర కల్లు విక్రయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు యాదయ్య. తాటి, ఈత కల్లుతో పోల్చుకుంటే ఖర్జూర కల్లు చాలా తియ్యగా ఉంటుంది. ఖర్జూర కల్లులో ఎలాంటి వాసన ఉండదు. కల్లు తాగిన వారి వద్ద కూడా వాసన రాదు.
అచ్చు కొబ్బరి నీళ్లలా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్‌లో కొందరు రైతులు కర్జూ చెట్లను సాగు చేస్తున్నారు. ఆ చెట్ల నుంచి కల్లు తీస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ కల్లు ఆరోగ్యంతో పాటు, ఆదాయాన్ని ఇస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఖర్జూర కల్లుకు ఉందని అంటున్నారు కల్లు ప్రియులు.
సాథారణంగా తాటికల్లు, ఈతకల్లు చేదుగా, పుల్లగా, కొన్ని సార్లు తియ్యగా, వంగరుగా కూడా ఉంటుంది. కానీ ఖర్జూర కల్లు మాత్రం తియ్యగా, రుచిగా ఉంటుందని అందరూ తాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవాపూర్ కర్జూర కల్లుకు ఒక బ్రాండ్‌గా మారింది. ఖర్జూర కల్లు తాగేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలివెళుతున్నారు. ఖర్జూర కల్లు టేస్ట్‌ని ఆస్వాదిస్తున్నారు.
ఉదయాన్నే ఈ కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని, అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. తాటి చెట్టు, ఈత చెట్టు అయితే సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే కల్లుని ఇస్తాయి. అదే ఖర్జూర చెట్లు అయితే ఏడాది మొత్తం కల్లుని ఇస్తాయి. ఒక్కో చెట్టు నుంచి రోజుకు 20 లీటర్ల కల్లు వస్తుంది. లీటర్ వంద రూపాయలకు విక్రయిస్తున్నారు.
కర్జూర కల్లు తాగేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నా చెట్లు తక్కువగా ఉండడంతో సరిపడా కల్లు ఉత్పత్తి చేయలేకపోతున్నామని కల్లు విక్రయదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సహకరించి కర్జూర చెట్లను పెంచి తమకు ఉపాధి కల్పించాలని గీత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన కర్జూర కల్లును అందిస్తామని అంటున్నారు.