Dehydration: వర్షాకాలంలో డీహైడ్రేషన్ అయితే మీ ప్రాణాలకే ముప్పు, మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?

Dehydration: వర్షాకాలంలో డీహైడ్రేషన్ అయితే మీ ప్రాణాలకే ముప్పు, మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?
Dehydration: వర్షాకాలంలో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీనితో శరీరంలో డీహైడ్రేషన్ లేదా నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సమస్య తీవ్రమైతే ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులు కూడా సంభవిస్తుంటాయి. అయితే చాలా మంది చేసే ఒక సాధారణ తప్పు ఏమిటంటే..వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం, తమ రోజువారీ కార్యకలాపాలు, పని ఒత్తడిలో పడి నీరు త్రాగటం మర్చిపోతుంటారు.

ఇది మిమ్మల్నీ డిహైడ్రేషన్‌కు గురి చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి 30-45 నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా ఒక గ్లాస్ చొప్పున నీరు తాగటం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. ఇది మీలో నిర్జలీకరణాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. మీరు తినే ఆహారం నుండి కూడా హైడ్రేషన్ వస్తుందని మీకు తెలుసా?
Also Read: ఆవు, గేదె పాలు కాకుండా.. ఈ పాలు తాగితే చాలు.
వర్షాకాలంలో నీరు అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవటం తప్పనిసరి అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. బీరకాయ, సొరకాయ, దోస, కీర దోసకాయ వంటి కూరగాయలు, పుచ్చకాయ, నారింజ వంటి పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవన్నీ మన శరీరాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది.
డి హైడ్రేషన్ లక్షణాలు..
అలసట.. అకస్మాత్తుగా శరీరంలో శక్తి లేకపోవడం నిర్జలీకరణానికి సంకేతం. అంతేకాదు, పెదవులు, నోరు పొడిబారటం కూడా డి హైడ్రేషన్ లక్షణాలు. ఇది శరీరానికి ఎక్కువ ద్రవాలు అవసరమని సూచించే సాధారణ ప్రారంభ సంకేతాలుగా గుర్తించుకోవాలి. తగ్గిన మూత్రవిసర్జన, ముదురు పసుపు మూత్రం కూడా హైడ్రేట్ కావడానికి ఖచ్చితమైన సంకేతం. అంతేకాదు చిరాకుగా కూడా ఉంటుంది.
Also Read: ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వారు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరా..?
మానసిక స్థితిలో అకస్మాత్తుగా మార్పు కొన్నిసార్లు నిర్జలీకరణం నుండి అసౌకర్యాన్ని సూచిస్తుంది. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎక్కువ నీరు, లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) వంటివి వెంటనే తీసుకోవాలి.
Also Read: ఈ ఆకులను రోజు రెండు తింటే చాలు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, విరేచనాలు లేదా వాంతులు వచ్చినప్పుడు ద్రవాలు మాత్రమే కాకుండా, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు కూడా కోల్పోతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ORS) కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.