Health

Delivery Tips: గర్భిణీలు ఈ చిన్న చిన్న పనులు చేస్తే నార్మల్ డెలివరీ అవ్వడం ఖాయం.

Delivery Tips: గర్భిణీలు ఈ చిన్న చిన్న పనులు చేస్తే నార్మల్ డెలివరీ అవ్వడం ఖాయం.

Delivery Tips: కొంత మంది మెడికల్ రీజన్స్ వల్ల నాచురల్ డెలివరీ ఇష్టపడితే కొంతమంది ప్రకృతి పరంగానే పిల్లల్ని కనడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే నేచురల్ డెలివరీని సపోర్ట్ చేసే డాక్టరని వెతకడం చాలా కష్టం. మీ డెలివరీ పద్ధతి మీద మీ డాక్టర్ కే నమ్మకం లేకపోతే అటువైపు నుంచి మీకొచ్చే సాయం ఏమీ ఉండదు. అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నుంచే నార్మల్ డెలివరీ అయ్యేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు. ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెంట్​గా ఉన్నప్పుడు, డెలివరీ అయిన తర్వాత కొన్ని ఫాలో అయితే.. నార్మల్ డెలివరీ కాంప్లికేషన్స్, భయాలు ఉండవంటున్నారు.

Also Read: క్యాన్సర్‌ రోగులకు గుడ్ న్యూస్.

ప్రెగ్నెన్సీకి ముందు..లేబర్ ప్రొసెస్​ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అలాగే నొప్పిని భరించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల సూచనలు తెలుసుకోవాలి. అలాగే మీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నార్మల్ డెలివరీ ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రిపేర్ అవ్వాలి. రెగ్యులర్​గా వ్యాయామం చేస్తూ ఉండాలి. దీనివల్ల నార్మల్ డెలివరీకి మీ శరీరం బాగా సహకరిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పోషకాలతో నిండిన ఆహాలం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్​ని వైద్యులు ఇస్తారు. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో డీహైడ్రేట్​ కాకుండా నీటిని తాగాలి.

ప్రెగెన్సీ డేట్ దగ్గరపడుతున్న సమయంలో ఫుడ్​ని ఒకేసారి కాకుండా.. కొంచెం కొంచెంగా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. నొప్పిని భరించేందుకు.. నార్మల్ డెలివరీ సమయంలో లేబర్ పెయిన్స్​ని తట్టుకోవాలి. కాబట్టి డీప్ బ్రీతింగ్, మెడిటేషన్, యోగా వంటివి ప్రాక్టీస్ చేయాలి. వీటివల్ల నొప్పి కంట్రోల్ అవుతుంది. యాంగ్జైటీ కూడా దూరమవుతుంది. యోని దగ్గర పెరినియల్ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. డెలివరీ సమయంలో చిరిగిపోయే ప్రమదాన్ని ఇది తగ్గిస్తుంది. బాల్ ఎక్సర్​సైజ్​లు చేస్తూ ఉండాలి. పెల్విస్, బ్యాక్ పెయిన్​ని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. డెలివరీ సమయంలో.. ప్రసవించే ముందు వాకింగ్ చేయండి.

Also Read: ఉడకబెట్టిన పల్లీల గురించి ఈ విషయాలు తెలిస్తే చాలు.

బేబి బయటకు వచ్చేలా పొజిషన్స్ మార్చుకుంటూ ఉండాలి. బర్త్ స్టూల్​ ఉపయోగిస్తే ఈజీగా ప్రసవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డీప్ బ్రీత్ చేస్తూ నొప్పిని కంట్రోల్ చేయవచ్చు. మెడిటేషన్ వంటివి నొప్పిని, యాంగ్జైటీని దూరం చేసి పరిస్థితిని తీవ్రం కాకుండా హెల్ప్ చేస్తాయి. అనవసరమైన మందులు, వైద్యులు సూచించని మెడికేషన్​కు వీలైనంత దూరంగా ఉండండి. డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నార్మల్ డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో వైద్యులను అడిగి తెలుసుకోండి. వాటిని కచ్చితంగా ఫాలో అవ్వండి.

మీ శరీరం హీల్ అయ్యేవరకు, రికవర్​ అయ్యేవరకు టైమ్ తీసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. ప్రెగ్నెన్సీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. మీ ఆరోగ్య పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో రీజన్స్ డెలివరీపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి.. అందరూ నార్మల్ డెలివరీతో పిల్లలను కనలేరు. కానీ కరెక్ట్​గా ట్రై చేస్తే.. నార్మల్ డెలివరీ కావొచ్చు. కానీ నార్మల్ డెలివరీ కోసం పంతం పట్టి ప్రాణాల మీదకి తెచ్చుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker