Depression: ఈ కాలంలోనే ఎక్కువ మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. కారణమేంటంటే..?

Depression: ఈ కాలంలోనే ఎక్కువ మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. కారణమేంటంటే..?
Depression: డిప్రెషన్ అనేది మానసిక స్థితి తక్కువగా ఉండటం, అలసట, అపరాధం, చిరాకు మరియు కార్యకలాపాల్లో ఆసక్తి లేదా ఆనందం కోల్పోవడం వంటి లక్షణాలతో కూడిన సంక్లిష్టమైన మానసిక ఆరోగ్య పరిస్థితి. అయితే ఈ ప్రపంచంలో దాదాపుగా 21 శాతం మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. కేవలం పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తలనొప్పి, కండరాల నొప్పి, కడుపు తిమ్మిరి, అజీర్ణం, నిద్రలేమి, శ్వాస సమస్యలు వస్తాయి.
Also Read: మూత్రం వాసనా వస్తుందా..!
అలాగే గుండె పోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే మాత్రం తప్పకుండా నవ్వుతుండాలి. పెద్దవారు రోజుకి కేవలం 20 సార్లు మాత్రమే నవ్వుతారు. వయస్సు పెరిగే కొద్దీ నవ్వడం ఆపేస్తారు. దీనివల్ల కూడా డిప్రెషన్ లోకి వెళ్తారు. కాబట్టి నవ్వడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల డిప్రెషన్ దూరమవుతుంది. రోజూ కొంత సమయం ఎండలో కూర్చోండి. దీని వల్ల మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలాగే వాకింగ్, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండండి. ఒంటరిగా ఉండే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి.

దీంతో మీరు డిప్రెషన్‌లోకి వెళ్తారు. అదే ఒంటరిగా ఉండకుండా ఎల్లప్పుడూ బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మంచి పుస్తకాలు చదవడం, ఎల్లప్పుడూ వర్క్‌లో బిజీగా ఉండటం, పాటలు వినడం వంటివి చేస్తుండండి. వీటివల్ల కూడా మీరు డిప్రెషన్ నుంచి బయట పడతారు. ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు డిప్రెషన్ నుంచి విముక్తి కలిగించే పదార్థాలను మాత్రమే తీసుకోండి. రోజూ పండ్లు, కూరగాయల జ్యూస్ తాగండి. అలాగే డ్రై ఫ్రూట్స్ తినడం, గ్రీన్ టీ తాగడం, పసుపు పాలు తాగడం, పెరుగు వంటి ప్రో బయోటిక్స్ తినడం, అవిసె గింజలు తీసుకోవడం వంటివి చేయాలి.
Also Read: జ్వరం వచ్చినపుడు చికెన్ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇలాంటి వాటిని తినడం వల్ల ఈజీగా డ్రిపెషన్ నుంచి బయట పడతారు. అలాగే చలి నుంచి కూడా విముక్తి పొందుతారు. చలి వల్ల వచ్చే డిప్రెషన్ కాబట్టి ఫస్ట్ శరీరానికి వెచ్చగా అనిపించే వాటిని తీసుకోవాలి. అప్పుడే మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు.