Health

షుగర్ వ్యాధి మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా వస్తుంది, ఎందుకో తెలుసా..?

గ్లూకోజ్ అనేది ఒక రకమైన చక్కెర. కండరాలు, ఇతర కణజాలాలను తయారు చేసే కణాలకు ఇది శక్తి వనరు. మన శరీరానికి గ్లూకోజ్ రెండు ప్రధాన వనరుల నుంచి అందుతుంది. వ్యక్తులు తినే ఆహారం లేదా కాలేయం ద్వారా ఇది లభిస్తుంది. అయితే ఈ డయాబెటీస్ మగవారికి, ఆడవారికి సమానంగా వస్తుంది. కానీ.. టైప్ -1, టైప్ -2 డయాబెటీస్ పక్కాగా వస్తుంది. కానీ ఆడవారికి గర్భధారణ సమయంలో ఎక్కువగా వస్తుంది. ఇలాంటి డయాబెటీస్ డెలివరీ తర్వాత తగ్గిపోతుంది.

అయితే కొంతమందికి ఇలాంటి డయాబెటీస్ డెలివరీ తర్వాత కూడా అలాగే ఉంటుంది. డయాబెటీస్ ఉన్న ఆడవారికి మూత్రనాళ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. షుగర్ వ్యాధి వల్ల మూత్రం మొత్తం పెరుగుతుంది. ఇది మూత్రనాళ సంక్రామ్యతలకు దారితీస్తుంది. యోని సంక్రామ్యతలు కూడా సంభవించొచ్చు. డయాబెటీస్ ఉన్న కొంత మంది ఆడవారికి రుతుక్రమ రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది.

కానీ ఇది డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్క ఆడవారిలో కనిపిస్తుందని చెప్పలేం. దీనివల్ల పీరియడ్స్ కాలాలు మారొచ్చు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా పిసిఒఎస్ ఉన్న మహిళలకు కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిసిఒఎస్ సమస్యను డయాబెటిస్ ఉన్న ఆడవారిలో కనిపిస్తుంది. ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అని పిలువబడే డయాబెటిస్ అనేది గర్భధారణ సమయంలో సంభవిస్తుంది. దీనివల్ల కొంతమంది మహిళల్లో ఎక్కువ బరువున్న పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతి ఒక్కరిలో కనిపించే సమస్య కాదు.

గర్భధారణ సమయంలో డయాబెటిస్ వచ్చే మహిళలకు తర్వాత కూడా టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వివిధ అధ్యయనాల ప్రకారం.. డయాబెటిస్ ఉన్న కొంతమంది మహిళల్లో గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, నిరాశకు దారితీస్తుంది. ఇవన్నీ మళ్లీ డయాబెటిస్ పెరగడానికి దారితీస్తాయి. అలాగే రుతువిరతి మహిళల్లో ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే పురుషుల కంటే మహిళలే ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker