ఈ కాలంలో డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.
జనంలో అవగాహన పెరగడం వల్ల మధుమేహం పట్ల భయాలు తొలగిపోయాయి. కానీ, ఆ మహమ్మారి ఒంటరిగా దాడిచేయదు. రుగ్మతల మూకను వెంటబెట్టుకొని వస్తుంది. ఆ గుంపులోని మరో ప్రతినాయకుడు.. డయాబెటిక్ ఫూట్ అల్సర్. అజాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఒక్కోసారి కాలు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అయితే మధుమేహులకు మాత్రం కొన్ని రకాల కూరగాయలు ఎంతమాత్రం మంచివి కావు. వీటిని తింటే వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాదు.. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి.
బంగాళా దుంపలు మధుమేహుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటిలో పిండిపదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయన్న మాట. ముఖ్యంగా బంగాళా దుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ సూచిక ఎక్కువగా ఉంటుంది. కాల్చిన పొటాటోలో దాదాపుగా 111 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే.. ఉడికించిన దానిలో అయితే 82 ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా.. డయాబెటీస్ పేషెంట్లు మాత్రం మొక్కజొన్నను అసలే తినకూడదు.
ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 52 ఉంటుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ దీన్ని పైబర్ ఫుడ్ గా పరిగణించరు. ఒకవేళ తినాలనుకుంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో కలిపి తినండి. దీన్ని ఒక్కదాన్నే తింటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. బఠాణీల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. పిండి పదార్థాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటివల్ల మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
ఇంతేకాదు వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 గా ఉంటుంది. అందుకే డయాబెటీస్ రోగులు బఠాణీలను తినకూడదు. గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. కానీ వీటిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిను కంట్రోల్ లో ఉంచుతుంది. అందుకే గ్రీన్ వెజిటేబుల్స్ ను సలాడ్ లా కాకుండా.. మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. టామాలు ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా వీటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటమే కాదు..
తీపి కూడా ఉంటుంది. అందుకే మధుమేహులు పచ్చి టమాటాలను మొత్తానికే తినకూడదు. వంటల్లో కూడా తక్కువగానే వేయాలి. అరటికాయను కూడా వివిధ రకాల కూరలు చేయడానికి ఉపయోగిస్తుంటారు. అందుకే కొంతమంది దీన్ని కూరగాయగా పరిగణిస్తారు. అయితే అరటిలో ఎక్కువ మొత్తంలో తీపి, పిండిపదార్థాలు ఉంటాయి. ఇవి మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు వీటిని కూడా తినకూడదు.