News

రాడిసన్ హోటల్ కేసులో బిగ్ ట్విస్ట్, అడ్డంగా దొరికిపోయిన స్టార్ డైరెక్టర్.

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తీగలాగితే డొంక కదులుతోందా.. పట్టుబడిన వాళ్లే కాకుండా తెర వెనుక పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారనే సమాచారం అందుతోంది. ప్రముఖ హీరో బిజినెస్ పార్టనర్ కి కూడా ఈకేసులో లింకులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఫిబ్రవరి 24న గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో పార్టీ జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్లలో డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసులకు పక్కా సమాచారం రావడంతో రైడ్ చేసి పట్టుకున్నారు. ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

ఆరోజు జరిగిన డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లుగా తేల్చి ఏ8గా ఆయన పేరు చేర్చారు. తర్వాత డ్రగ్స్ సప్లైయర్ సయ్యద్ అలీని విచారించడంతో శ్వేత, లిషి, నీల్ కూడా ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీకి సప్లై చేసిన డ్రగ్స్ ను మీర్జా వహీద్ బేగ్ నుంచి కొనుగోలు చేశానని, వాటిని వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అందజేశానని వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

దీంతో ఈ కేసులో గజ్జల వివేకానంద డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ ను చేర్చినట్లు పోలీసులు తెలిపారు. 24న జరిగిన డ్రగ్స్ కేసులో పట్టుబడిన వాళ్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో ఓ బీజేపీనేత కుమారుడు ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. అలాగే సినిమా హీరో అల్లు అర్జున్ వ్యావార భాగస్వామి శెలగంశెట్టి కేదార్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది.

స్టైలీష్ స్టార్ బన్నీతో పాటు శెలగంశెటచ్టి కేదార్నాథ్ కలిసి హై లైఫ్, జూబ్లి 800 పబ్, బఫెలో, వైల్డ్ వింగ్స్ పబ్ లలో పార్టనర్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. శెలగంశెట్టి కేదార్నాథ్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్, బడా బిజినెస్ మాన్ కావడంతో పేరు బయటికి రాకుండా పెద్దలు దాచి పెడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker