16000 గుండె ఆపరేషన్లు చేసిన యువ డాక్టర్, చివరికి గుండెపోటుతో మృతి.

కార్డియాలిజిస్టు గాంధీగా పేరొందని ఈ డాక్టర్ తన వైద్య వృత్తిలో ఇప్పటివరకూ 16000కు పైగా గుండె ఆపరేషన్లు నిర్వహించి రికార్డు స్థాపించారు. కాగా మంగళవారం రాత్రి నిద్రలో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చిన ఈ డాక్టరు అచేతన స్థితిలోకి వెళ్లాడు. తరువాత చనిపోయ్యారు. అయితే గత కొన్నేళ్లుగా చాలా మంది యువ సెలబ్రిటీలు, సహా సాధారణ యువకులు, చిన్నారులు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒక నివేదిక మేరకు.. యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. ఇంకా ఇలాంటి అనేక కారకాలు గుండెపోటు ప్రమాదాలను పెంచుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. తన కెరీర్లో 16 వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు చేసిన యువ వైద్యుడు గౌరవ్ మరణంతో అందరూ షాక్ అవుతున్నారు. యువతలో హార్ట్ఎటాక్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. డాక్టర్ గౌరవ్ గాంధీ కేవలం 41 సంవత్సరాల వయస్సులో 16,000 కంటే ఎక్కువ గుండె శస్త్రచికిత్సలు చేసి అనేక మంది ప్రాణాలను కాపాడిన యువ కార్డియాలజిస్ట్.
కానీ, తనకే ఆ కష్టం వచ్చినప్పుడు అతను తన ప్రాణాలను కాపాడుకోలేకపోయాడు. అతను గుండెపోటుతోనే మరణించాడు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు గాంధీ తన ఇంట్లోనే బాత్రూమ్లో కుప్పకూలిపోయాడు. వెంటనే జీజీ ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రికి చేరుకున్న 45 నిమిషాల్లోనే అతడు మృతి చెందాడు. డాక్టర్ గాంధీ సోమవారం ఎప్పటిలాగే రోగులను కలుసుకున్నారు. ఆ రాత్రికి నగరంలోని ప్యాలెస్ రోడ్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చారు.
ఎలాంటి ఫిర్యాదులు, ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పులు లేకుండా భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులు అతన్ని లేపేందుకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించి హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ గాంధీ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. అంత గొప్ప డాక్టర్ ఇంత చిన్నవయసులోనే, అది గుండెపోటుతో మరణించడం పట్ల అందరూ దిగ్భ్రాంతి చెందారు. కానీ, ఒక్క ప్రశ్న మాత్రం అందరినీ సందేహంలో పడేస్తుంది.
యువతలో గుండెపోటు కేసులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? గత కొన్నేళ్లుగా చాలా మంది యువ సెలబ్రిటీలు, సహా సాధారణ యువకులు, చిన్నారులు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒక నివేదిక మేరకు.. యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. ఇంకా ఇలాంటి అనేక కారకాలు గుండెపోటు ప్రమాదాలను పెంచుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.