దోమలు ఎక్కువగా ఇలాంటివారినే కుడతాయి, ఎందుకో తెలుసా..?
దోమల దెబ్బకు వచ్చే వ్యాధులు అన్నీ ఇన్ని కాదు. డ్రైనేజీల పక్కన ఉండే వాళ్ళ బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇదిలా ఉంచితే దోమల గురించి ఒక ఆసక్తికర విషయం ఏంటీ అంటే… దోమ కుట్టిన వెంటనే మనకు దురద పుడుతుంది. అయితే మనలో చాలా మంది దోమలు తమనే ఎక్కువగా ఎందుకు కుడతాయని ప్రశ్నించుకుంటారు. అయితే ఈ విషయంలో దోమలకేమి పక్షపాతం ఉండదు.
కానీ దీని వెనుక సైన్సు ఉందంటారు కొందరు. మనకు నచ్చిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నట్లే… దోమలు కూడా వాటికి నచ్చిన తిండిని ఎంచుకుంటాయి. దోమలు కుట్టడానికి కారణం..రక్తం.. దోమలకు రక్తమంటే చాలా ఇష్టమని చాలా మంది చెబుతారు. అందులో కొంత వాస్తవం ఉంది. దోమలు కొన్ని రక్త వర్గాలకు చెందిన వారిని కుట్టడానికే ఇష్టపడతాయి. ముఖ్యంగా దోమలు ‘’O’ బ్లడ్ గ్రూప్’ వర్గానికి చెందిన వారినే ఎక్కువగా కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
వాసన.. శరీర వాసనకు కూడా దోమలు ఆకర్షితులవుతాయి. అంటే పెర్ఫ్యూమ్ వాడేవారిని దోమలు కుట్టవని అర్థం కాదు. శరీర చెమట అమ్మోనియా మరియు లాక్టిక్ యాసిడ్ వంటి అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉంటుంది, ఇది దోమలను విపరీతంగా ఆకర్షిస్తుంది. బాక్టీరియా..బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న చోట దోమలు ఎక్కువగా ఉంటాయి. అపరిశుభ్రమైన ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం.
ఒక పరిశోధన ప్రకారం, దోమలు మన పాదాలను ఎక్కువగా కుడతాయి, ఎందుకంటే పాదాలలో బ్యాక్టీరియా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్..దోమలు కార్బన్ డయాక్సైడ్ కు ఎట్రాక్ట్ అవుతాయి. ఎక్కువ సేపు ఊపిరి పీల్చుకుంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుట్టడానికి ఇష్టపడతాయి. జీవక్రియ రేటు.. మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. గర్భిణీ స్త్రీలు అధిక జీవక్రియ రేటును కలిగి ఉంటారు, కాబట్టి వారు దోమ కాటుకు గురవుతారు.