Health

ఇలాంటి వారు మామిడి పండ్లు తినకపోవడమే మంచిది, ఎందుకంటే..?

ఎండాకాలంలో పుష్టిగా లభించే ఈ మామిడి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అలాగే సహజ చక్కెర, ఖనిజాలు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇక ఈ పండులో యాంటీ ఆక్సిడేటివ్, పాలీఫెనాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అయితే మామిడి పండ్లను మోతాదుకు మించి తింటే విరేచాల సమస్య చుట్టుకుంటుంది. ఈ పండులో ఉండే పీచు పదార్థం, ఫైబర్ విరేచనాలకు కారణమవుతుంది. కాబట్టి వీటిని పరిమితికి మించి అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే మామిడి పండు ఒక్క ఎండాకాలంలోనే పండుతుంది. ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు మాత్రం మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పండ్లలో రారాజు మామిడి. ఈ మామిడి పండ్లు ఒక్క ఎండాకాలంలోనే పండుతాయి. అందుకే ఈ పండ్లను ఎక్కువగా తింటుంటారు. కొందరైతే ఎండాకాలం ముగిసే వరకు ఈ పండ్లను తింటూనే ఉంటారు. నిజానికి మామిడి పండ్లు తీయగా, రుచిగా ఉండటమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

మామిడి పండులో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఐరన్, కాపర్, బీటాకెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే అధిక బరువు నుంచి రక్తహీనత సమస్య వరకు ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఈ పండు మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు మాత్రం మామిడి పండ్లను తినడం అంత సేఫ్ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మామిడి పండ్లలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుందని, ఈ యూరిక్ యాసిడ్ సమస్య పేలవమైన జీవక్రియకు సంబంధించిన వ్యాధి కాబట్టి మామిడి పండ్లు తినడం ప్రయోజనకరంగానే ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజమేంటంటే.. యూరిక్ యాసిడ్ రోగులకు మామిడి పండ్లు ప్రయోజనకరంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మామిడి పండ్లను ఎక్కువగా తింటే అందులో ఉండే ఫ్రక్టోజ్ బ్లడ్ షుగర్ ను పెంచడమే కాకుండా యూరిక్ యాసిడ్ లెవల్స్ ను కూడా పెంచి కాలేయ సమస్యలు, గౌట్ నొప్పిని మరింత ఎక్కువ చేస్తుంది.

ఫ్రక్టోజ్ పెరగడం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే శరీరం ఫ్రక్టోజ్ ను విచ్ఛిన్నం చేసినప్పుడు ప్యూరిన్లు విడుదలవుతాయి. ప్యూరిన్లు ఎక్కువగా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి.. మంట, నొప్పి పెరుగుతాయి. మామిడి సీజనల్ పండు. దీనిని తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే మాత్రం మామిడి పండును ఎక్కువగా తినకూడదు. దీనిని పరిమితిలోనే తినాలి. అంటే వీళ్లు మామిడి పండ్లను వారానికి 2 సార్లు మాత్రమే తినాలి. అది కూడా తక్కువ మొత్తంలో. దీన్ని ప్రతిరోజూ ఎక్కువ మొత్తంలో తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది గౌట్ సమస్యను పెంచుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker