Health

ఈ నొప్పులు ఉన్నవారు టమోటాలు తినకూడదు. పొరపాటున తిన్నారో..?

టమాటా, సాంబారు, రసం, పులుసు ఇలా అనేక రకాలుగా వినియోగిస్తారు. టమాటాలను అలాగే పచ్చిగా కూడా తినవచ్చు. అందరూ ఎర్ర టామాటాను ఎక్కువగా వాడతారు, అయితే పచ్చి టమోటో ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎర్రటి టమాటా మార్కెట్‌లోని అన్ని షాపుల్లో పుష్కలంగా దొరుకుతుంది. అయితే మనం ఆరోగ్యం మనం తినే ఆహారంతో ముడిపడి ఉంటుంది. కొన్నిసార్లు తినేది ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ అది మీకు ప్రమాదకరం కావచ్చు.

ఎందుకంటే మీరు ఇప్పటికే ఏవైనా అనారోగ్య సమస్యలను కలిగి ఉంటే, అందుకు తగినట్లుగా కచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి. ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి, అంటే ఈ రకమైన వ్యాధులు ఉన్నప్పుడు వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పించే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థనే మనకు శత్రువులా తయారవుతుంది. ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మన శరీరంలోని రోగనిరోధక కణాలు మన ఎముకలు, కండరాలపైనే దాడి చేస్తాయి. ఫలితంగా మన కీళ్ళు ప్రభావితమవుతాయి, వాటి పనితీరు చెడిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇది చాలా తీవ్రమైన పరిస్థితిగా మారుతుంది, నడవడం కూడా కష్టం అవుతుంది.

ఇది కీళ్ల వాపుకు కారణమవుతుంది. అందువల్ల ఆర్థరైటిస్ అనేది చాలా బాధాకరమైన వ్యాధి. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులలో కీళ్లు కదలకుండా గట్టిపడటం, కీళ్లలో వాపు రావడం వంటి కొన్ని అసౌకర్యం కలిగించే లక్షణాలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో, కొన్ని రకాల ఆహార పదార్థాలలోని సమ్మేళనాలు ఈ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఆర్థరైటిస్ రోగులు టొమాటోలు తినకూడదు.. ఆర్థరైటిస్ రోగులు టమోటాలు తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

ఎందుకంటే టమోటాలు ఆర్థరైటిస్‌ను మరింత అధ్వాన్నంగా మారుస్తాయి. తద్వారా కీళ్ల నొప్పులు మరింత ఎక్కువవుతాయి. టొమాటోలో విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటాయి. ఇది ఆహారంలోని కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. కాల్షియం క్షీణతతో ఎముకలు లోపలి నుండి బోలుగా మారుతాయి. ఆర్థరైటిస్ పేషెంట్ రోజూ టొమాటోలు తీసుకుంటే కీళ్ల నొప్పులు వేగంగా పెరుగుతాయి, కాబట్టి కీళ్లనొప్పులు ఉన్నవారు టమోటాలు నివారిస్తే మంచిది.

అలాగే చక్కెర పానీయాలు, ఆల్కాహాల్, పొగాకు వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఎలాంటి కూరగాయలు తీసుకోవడం సురక్షితం.. ఎవరైనా కీళ్లనొప్పులతో బాధపడుతుంటే ఆకుపచ్చని ఆకుకూరలు, కాయగూరలను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. వెల్లుల్లి, పచ్చి పసుపు, బ్రోకలీ వంటివి తీసుకోవాలి . అలాగే లవంగాలు, దాల్చినచెక్క వంటి సుగంధాలను తింటూ ఉండాలి. ఇవి సహజ నొప్పి నివారిణిలుగా పనిచేయడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker