ఆరోగ్యమని ఎక్కువగా ఆపిల్స్ తింటే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా..?
యాపిల్ పండును తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇతర ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలకన్నా యాపిల్ పండ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఎక్కువఆపిల్ లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాలని మరియు నాడీ వ్యవస్థ మెరుగుదల కి దోహద పడుతుంది. అయితే ఆపిల్ పండులో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. వీటిలో ఫాస్పరస్, విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఎన్నో రకాల అంటువ్యాధులను, ఇతర వ్యాధులను దూరంగా ఉంచడానికి సహాయపడుతాయి. జీర్ణ సమస్యలు..మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ కంటెంట్ చాలా అవసరం. ఈ ఫైబర్ ఆపిల్స్ లో పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది మన శరీరంలో పీచు పదార్థం పెరిగి పోతే జీర్ణక్రియకు సంబంధించి ఎన్నో సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ కంటెంట్ ను మోతాదుకు మించి తీసుకుంటే కడుపు ఉబ్బరంతో పాటుగా మలబద్దకం సమస్య కూడా వస్తుంది. రోజుకు 70 గ్రాముల కంటే ఎక్కువ పీచుపదార్థం తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
సో ఇంతకు మించి తీసుకోకండి. స్థూలకాయం..ఒక మీడియం సైజులో ఆపిల్ పండులో సుమారు 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే ప్రతిరోజూ ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటే మాత్రం మీరు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక ఆపిల్ పండుకు మించి తినకండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి..మధుమేహులు ఆపిల్ పండ్లను ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే వీటిలో షురగ్ కంటెంట్, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇక మధుమేహులు ఆపిల్స్ ను ఎక్కువగా తింటే మాత్రం వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. దంతాలు దెబ్బతింటాయి..ఆపిల్స్ ను మితిమీరి తింటే మాత్రం మీ దంతాలు దారుణంగా దెబ్బతింటాయి. ఎందుకంటే ఆపిల్స్ లో యాసిడ్ ఉంటుంది. దీనివల్ల ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటే దంతాలు దెబ్బతింటాయి. అలర్జీలు..పండ్ల వల్ల అలర్జీ వచ్చే వారు ఆపిల్ పండ్లకు ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది అలర్జీ సమస్యను పెంచుతుంది. అలర్జీ సమస్యలతో బాధపడేవారు ఆపిల్ పండ్లను తింటే పొత్తి కడుపు నొప్పి వస్తుంది. అలాగే వికారం, వాంతులు, తిమ్మిరి వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.