మంచిదని వేరుశెనగలు ఎక్కువగా తింటే ఈ సమస్యలు తప్పవు.
వేరు శనగల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఇ, సిలీనియం, ఫైబర్, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ల ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. రక్త ప్రసరణను మెరుగు చేసి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి. అయితే వేరుశెనగలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉన్నాయి. కాబట్టి వేరుశెనగను కొందరు బెస్ట్ ఫుడ్‌గా చెబుతారు. వీటిల్లో బాదంలో లభించే పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని చిన్న బాదం పప్పులు అని అంటారు.
వేరుశెనగలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, కొవ్వు ఆమ్లాల లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఈ పల్లిలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అయితే వీటిని తీసుకోడం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. థైరాయిడ్‌కు హానికరం.. హైపోథైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు అస్సలు ఈ వేరుశెనగలను తీసుకోవద్దు.
వేరుశెనగ తినడం వల్ల TSH (థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్) స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఇది ప్రాణాంతక సమస్యగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాలేయ సమస్యలు..ఇప్పటికే కాలేయ సమస్య ఉన్నట్లయితే.. వేరుశెనగలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. వేరుశెనగలో ఉండే మూలకాలు కాలేయానికి హాని చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీసే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.
అలర్జీ..కొందరిలో వేరుశెనగలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అలర్జీ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరుగుతుంది.. వేరుశెనగలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలున్నాయి. దీంతో బరువు కూడా పెరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో వీటిని తీసుకోకపోవడం చాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు.