టాయిలెట్ లో ఎక్కువ సేపు ఉంటె ఈ వ్యాధి రావడం ఖాయం.
బయట ఎంత శుభ్రంగా ఉన్నా.. ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత టాయిలెట్ శుభ్రతపై అంత శ్రద్ధ పెట్టరు. టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత రెండు చేతులను కనీసం నలభై సెకన్లపాటైనా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతిలో ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ ఉంటే అది పూర్తిగా తొలగిపోతుంది. టాయిలెట్‌కి వెళ్లిన వ్యక్తి చేతిలో ఫోన్ ఉంటే రెండు చేతులు సరిగ్గా కడుక్కోలేకపోవడం మొదటి కారణం.
ఆ తర్వాత సరిగ్గా శుభ్రం చేసుకోని ఆ చేత్తోనే తినటం జరుగుతుంది. ఫలితంగా హానికరమైన వైరస్‌లు, బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశిస్తాయి. అయితే మీరు టాయిలెట్ లో 10 నిమిషాల కంటే సమయంలో ఉన్నట్టైతే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కమోడ్ మీద ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులకు హేమోరాయిడ్స్ ఉండవచ్చు. ఎందుకంటే మీరు కమోడ్ మీద ఎక్కువసేపు కూర్చుంటే.. మీ బట్ (పిరుదుల) చుట్టూ ఒత్తిడి ఎక్కువ పడుతుంది.
దీని వల్ల పురీషనాళ సిరల్లో ఎక్కువ రక్తం పేరుకుపోతుంది. ఇది పైల్స్ కు దారితీస్తుంది. అందుకే టాయిలెట్ లో 10 నిమిషాలకు మించి ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు టాయిలెట్ నుంచి త్వరగా బయటకు రావాలి. దీనితో పాటుగా టాయిలెట్ కు వెళ్లినప్పుడు ఎక్కువ ఒత్తిడి చేయడం వల్ల రక్తనాళాల్లో వాపు, హేమోరాయిడ్స్ (మొలలు) ఏర్పడతాయి.
హేమోరాయిడ్స్ లక్షణాలు.. చాలా సందర్భాల్లో అర్షమొలల లక్షణాలు తీవ్రంగా ఉండవు. వాటంతట అవే నయం అవుతాయి. కానీ ఈ సమస్య ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. పాయువు చుట్టూ దురద, అసౌకర్యం, మలంలో రక్తస్రావం, మలం దగ్గర గాయాలు ఏర్పడతాయి, మొలలు మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. నొప్పి కూడా విపరీతంగా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువైతే నిల్చోలేరు, కూర్చోలేరు.