Health

జీడిపప్పు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..?

జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక కాజు తీసుకుంటే మేలు. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

అలాంటి ఆరోగ్య పోషకాలున్న డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు కూడా ఒకటి. జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, రాగి, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. అందుకే జీడిపప్పును పోషకాల నిధి అని పిలుస్తారు.దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు సూచిస్తారు. పైగా ఇవి ఎంతో రుచికరంగా కూడా ఉంటాయి.

అందుకే ఎంతోమంది వీటిని ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అదే సమయంలో జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరిగే అవకాశముందని కొందరు భయపడుతుంటారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదంటున్నారు నిపుణులు. జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే కాళ్ల నొప్పులు దూరమవుతాయి. కొలెస్ట్రాల్ లేని కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారంగా పరిగణిస్తారు.

ఇక ఈ డ్రై ఫ్రూట్ చర్మానికి మేలు చేస్తుంది. ముడతలను తగ్గించి వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అందుకే విద్యార్థులు వీటిని ఎక్కువగా తినాలంటారు. హైపర్‌టెన్సివ్ రోగులకు జీడిపప్పు మంచి ఆహారం. జీడిపప్పు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇది శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు ఎముకలను కూడా దృఢపరుస్తుంది. జీడిపప్పులో ఉండే కాపర్, ఐరన్ ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker