Health

పెర్‌ఫ్యూమ్స్ ఎక్కువగా వాడితే మగవారికి ఆ సామర్థ్యం తగ్గిపోతుంది.

పెర్ఫ్యూమ్స్ ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. పెర్ఫ్యూమ్స్ వాసన బాగుండటంతో పాటు అది ఎక్కువ సమయం వచ్చేది అయి ఉండాలి. దాని గాఢత ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. శరీరతత్వం, వెళ్లే కార్యక్రమానికి తగ్గట్లుగా పెర్ ఫ్యూమ్ ఉండాలి. అయితే పెర్ ఫ్యూమ్స్ చుట్టు పక్కల వారికి మంచి సువాసనలు కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ వాసనలు వారిని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.

దీని గాఢత వల్ల తుమ్ములు రావటం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీంతో కొంత అసహనానికి లోనవుతారు. ఈ గాఢత కలిగిన పెర్ ఫ్యూమ్స్ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫెర్ ఫ్యూమ్స్ లో ఇథనాల్ ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పెర్ఫ్యూమ్‌ను ఎక్కువగా వాడవద్దు. పెర్ఫ్యూమ్ కొనే ముందు ఏమైనా అలెర్జీలు ఉన్నాయేమో చూసుకోవాలి. పెర్ఫ్యూమ్ ఎక్కువగా వాడితే చర్మం దురద పెడుతుంది. ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాదులు వస్తాయని నిపుణులు అంటున్నారు.

పెర్ఫ్యూమ్‌లో ఉండే రసాయనాలు పురుషుడి లైంగిక సామర్థ్యంపై కూడా దెబ్బతీస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఫెర్ ఫ్యూమ్స్ పడకపోతే శరీరంలో అనేక లక్షణాలు బయటపడతాయి. తలతిరగటం, దద్దుర్లు, గందరగోళం, మగత, వాంతులు, హృదయ స్పందన రేటులో మార్పులు గమనించవచ్చు. దీర్ఘకాలంలో శ్వాసకోశ వ్యవస్ధపై తీవ్రమైన ప్రభావం చూపి గురక, హర్మోన్ అసమతుల్యత, ఆస్తమా వంటి సమస్యలకు కారణమవుతుంది.

తక్కువ మొత్తంలో స్ప్రే చేసుకుంటే సువాసన వెదజల్లుతుంది. ఎక్కువగా కొడితే మొదటికే మోసం వస్తుంది. కొన్ని బ్రాండ్ల పెర్ఫ్యూమ్ బాటిళ్లపై ఎంత దూరం నుండి స్ప్రే చేయాలో రాసి ఉంటుంది. అలాంటి వాటిని అంతే దూరం నుండి శరీరంపై స్ప్రే చేసుకోవటం మంచిది. ఉంది కదా అని ఎక్కువ వాడొద్దు.. ముందు అది ఎలా వాడాలో, ఎంత మొత్తంలో వాడాలో బాగా తెలుసుకునే అప్పుడు పెర్‌ఫ్యూమ్స్‌ వాడటం ఉత్తమం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker